KU : హనుమకొండ బీజేపీ నిరుద్యోగ మార్చ్ Photos చూడండి..
బీజేపీ (BJP) అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ(Telangana)లో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాల భర్తీపై తొలి సంతకం చేయిస్తాం. ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే.. ఆయా ఉద్యోగాల నియామకాలను పూర్తి చేయిస్తాం. త్యాగాలకు, పోరాటాలకు నిలయమైన ఓరుగల్లు గడ్డ(Orugallu Gadda)పై నిరుద్యోగ మార్చ్ సాక్షిగా మాట ఇస్తున్నా’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) ప్రకటించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అప్పీల్ చేస్తున్నా… నిరుద్యోగులారా(unemployes) నిరాశ పడకండి. బీజేపీ అండగా ఉంది. మాకు నేషన్ ఫస్ట్… ఫ్యామి లీ లాస్ట్. తెలంగాణలో యువత మాకు ఫస్ట్.. 30 లక్షల మంది నిరుద్యోగుల పక్షాన పోరాడేందుకు బీజేపీ కంకణం కట్టుకుందని బండి సంజయ్ అన్నారు
హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ చౌరస్తా (KU Caurasta) నుంచి అంబేడ్కర్ జంక్షన్ వరకు వేలాది మందితో బండి సంజయ్ నిరుద్యోగ మార్చ్ నిర్వహించారు.
విద్యార్థుల ఉద్యమ గడ్డ, ప్రోఫెసర్ జయశకంర్ (Professor Jayasakanr) పుట్టిన గడ్డ వరంగల్ అని, మమ్మల్ని అరెస్ట్ చేస్తే భయపడే కార్యకర్తలం కాదని ఆయన అన్నారు. నీళ్లు నిధులు నియామకాలు అన్న తెలంగాణాలో నిధులు పక్కదారి పట్టాయని ఆరోపించారు.
ఇదే వరంగల్ గడ్డపై తనను అరెస్ట్ చేశారని, కేసీఆర్ కి బలగం కేవలం కొడుకు, కూతురు, అల్లుడే అని, బీజేపీకి బలగం తెలంగాణ ప్రజలని ఆయన అన్నారు.
మా అత్త దశదిన కర్మకి వెళ్తే అరెస్ట్ చేశారు. గతంలో రేవంత్(Revanth) బిడ్డ పెళ్లి జరుగుతుంటే ఆయనను అరెస్ట్ చేశారు, సెంటిమెంట్ లేని వ్యక్తి మన సీఎం కేసీఆర్ అని విమర్శించారు.
టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజీతో 30 లక్షల మంది నిరుద్యోగులు, వారి కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, ఇందుకు కారకులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేలి్చచెప్పారు.
ఒక్కసారి బీజేపీ (BJP)కి అవకాశం ఇవ్వండి. తెలంగాణ గడ్డపై కాషాయ జెండాను ఎగరేస్తాం. రామరాజ్యం ఏర్పాటు చేస్తాం’ అని బండి సంజయ్ తెలిపారు.