»Horrible Punishment For Women For Changing Party Video Goes Viral
Video Viral : పార్టీ మారినందుకు మహిళలకు దారుణ శిక్ష..వీడియో వైరల్
పార్టీ మారినందుకు గిరిజన మహిళల్ని గ్రామంలో కిలోమీటరు వరకూ సాస్టాంగ ప్రదక్షిణలు చేయించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాజకీయ నాయకులు(Politicians) పార్టీలు మారడం మామూలే. రాత్రికి రాత్రే పార్టీలు మారుతుంటే వారిని అడిగేవారు చాలా తక్కువ. అలాంటిది మండల స్థాయి మహిళలు పశ్చిమ బెంగాల్ (West Bengal)లో పార్టీ మారారని వారికి దారుణమైన శిక్ష వేశారు. తృణమాల్ కాంగ్రెస్(Trinamool Congress)కు చెందిన కొందరు గిరిజన మహిళలు(Tribal Womens) గ్రామంలో అందరూ చూస్తుండగా దారుణ శిక్షను అనుభవించారు. బీజేపీలో చేరిన ఆరుగులు టీఎంసీ మహిళలను ఆ పార్టీ నేతలు గ్రామంలో సాస్టాంగ ప్రదక్షిణలు చేయించారు.
గ్రామంలో మహిళలు సాస్టాంగ ప్రదక్షిణలు చేస్తున్న వీడియో:
మహిళలు గ్రామంలో సాస్టాంగ ప్రదక్షిణ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది. ఈ విషయంలో బీజేపీ(BJP)లో నేతలు సీరియస్ అయ్యారు. మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించిన వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ విచారణ చేపట్టింది. వెస్ట్ బెంగాల్ లోని బాలూర్ ఘాట్ లోక్సభ నియోజకవర్గంలో గిరిజన కుటుంబాల(Tribal Families)కు చెందిన 200 మంది తృణమాల్ కాంగ్రెస్(Trinamool Congress) నేతలు ఏప్రిల్ 6న బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
వాళ్లంతా పార్టీ మారడం టీఎంసీ(TMc)లోని కొందరికి నచ్చలేదు. దీంతో ఆ ప్రాంతానికి చెందిన మార్టినా కిస్కు, షియులీ మార్డి, థక్రాన్ సోరెన్, మాలతీ ముర్ము అనే గిరిజన మహిళలను గ్రామంలో కిలో మీటరు వరకూ సాస్టాంగ ప్రదక్షిణలు చేయించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది. ఈ ఘటనపై పోలీసులు పట్టించుకోకపోవడంతో వారికి నోటీసులు అందాయి. వాస్తవాలు రాబట్టి నిందితులకు తగిన శిక్ష వేయాలని, నివేదికను సమర్పించాలని బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం నెట్టింట మహిళలు సాస్టాంగ ప్రదక్షిణలు చేస్తున్న వీడియో వైరల్(Video Viral) అవుతోంది.