»Telangana Ys Sharmila Fire On Nizamabad Govt Hospital Incident
నిజామాబాద్ ఆస్పత్రి ఘటనపై YS Sharmila ఆగ్రహం.. ఇదేనా మీ పాలన? అంటూ నిలదీత
యేటా రూ.11 వేల కోట్ల బడ్జెట్ అంటూనే.. రోగికి వీల్ చైర్ కూడా అందించలేని దరిద్రపు పాలన. ఇది మీరు చెప్తు ఆరోగ్య తెలంగాణ కాదు.. ప్రజలు చూస్తున్న అనారోగ్య తెలంగాణ
నిజామాబాద్ (Nizamabad Govt Hospital) ప్రభుత్వ ఆస్పత్రిలో రోగిని కాళ్లతో ఈడ్చుకుంటూ లాక్కెళ్లిన సంఘటనపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంఘటనపై తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (Harish Rao) విచారణకు ఆదేశించారు. కాగా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ సంఘటనపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) స్పందించారు. ‘ఇదేనా ఆరోగ్య తెలంగాణ’ అంటూ ప్రశ్నించారు.
‘దొరగారూ.. ఇదేనా ఆరోగ్య తెలంగాణ? రోగులను నేలపై లాక్కొని పోవడం కార్పొరేట్ వైద్యమా? స్ట్రెచర్లు, వీల్ చైర్లు లేకపోవడమే వసతుల కల్పనా? యేటా రూ.11 వేల కోట్ల బడ్జెట్ అంటూనే.. రోగికి వీల్ చైర్ కూడా అందించలేని దరిద్రపు పాలన. ఇది మీరు చెప్తు ఆరోగ్య తెలంగాణ కాదు.. ప్రజలు చూస్తున్న అనారోగ్య తెలంగాణ’ అని ట్విట్టర్ లో షర్మిల పోస్టు చేశారు. కాగా ఈ సంఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ (Hospital Superinted) ప్రతిమా రాజ్ వివరణ ఇచ్చారు.
‘రోగిని వైద్య పరీక్షల కోసం రెండో అంతస్తుకు తీసుకెళ్లాల్సి ఉంది. పేషెంట్ కేర్ సిబ్బంది వీల్ చైర్ తీసుకొచ్చే లోపే లిఫ్ట్ వచ్చింది. వీల్ చైర్ (Wheel Chair) తెచ్చే వరకు ఆగకుండా లిఫ్ట్ వచ్చిందని వారి తల్లిదండ్రులు అతడిని లాగుతూ తీసుకెళ్లారు. ఇది గమనించిన మా సిబ్బంది వారించారు. తర్వాత రెండో అంతస్తులో ఆ రోగికి పూర్తి వసతులతో వైద్యుడికి చూపించాం. ఇది తెలియని ఓ వ్యక్తి వీడియో తీసి వైరల్ చేశారు. ఈ సంఘటనకు, ప్రభుత్వ ఆస్పత్రికి సంబంధం లేదు’ అని ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్ స్పష్టం చేశారు.
దొర గారూ..ఇదేనా ఆరోగ్య తెలంగాణ?రోగులను నేలపై లాక్కొని పోవడం కార్పొరేట్ వైద్యమా?స్ట్రెచర్లు,వీల్ చైర్లు లేకపోవడమే వసతుల కల్పనా?ఏటా 11వేల కోట్ల బడ్జెట్ అంటూనే..రోగికి వీల్ చైర్ కూడా అందించలేని దరిద్రపు పాలన.ఇది మీరు చెప్తున్న ఆరోగ్య తెలంగాణ కాదు..ప్రజలు చూస్తున్న "అనారోగ్య తెలంగాణ" pic.twitter.com/p28q3BApnD