»Kishan Reddy Comments On Kcr About Ap Visakha Steel Plant April 16th 2023
Kishan Reddy: కేసీఆర్ నెల విడిచి సాము చేస్తున్నారు
కేసీఆర్ ఫ్యామిలీ వైఫల్యాలను పక్కదారి పట్టించేందుకే కేసీఆర్(kcr) పలు రకాల ప్లాన్స్ అమలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ఆరోపించారు. తాజాగా విశాఖ ప్లాంట్ విషయంలో కూడా అదే చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో కూడా సింగరేణిని కేంద్రం ప్రైవేటీకరణ చేస్తుందని ప్రజలను తప్పుదొవ పట్టించారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.
గత వారం రోజులుగా ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్(visakha steel plant) విషయంలో సీఎం కేసీఆర్(cm kcr) నెల విడిచి సాము చేస్తున్నట్లు ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) అభిప్రాయం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కొంటామని బీఆర్ఎస్(BRS) నేతలు వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఆ క్రమంలో వెంట వెంటనే సింగరేణి అధికారులను కేసీఆర్ వైజాగ్(visakha steel plant) పంపించినట్లు గుర్తు చేశారు. మరోవైపు సింగరేణి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం(central government) ప్రైవేటీకరణ చేస్తుందని కేసీఆర్ ఆరోపణలు చేశారని హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి ఈ మేరకు గుర్తు చేశారు.
అసలు సింగరేణి(singareni)లో రాష్ట్ర ప్రభుత్వానిదే 51 శాతం వాటా ఉండగా కేంద్రం ఎలా ప్రైవేటీకరణ చేస్తుందని ప్రశ్నించారు. ఇలా అనేక అంశాల్లో బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందన్నారు. అసలు కేసీఆర్(kcr) సీఎం అయిన తర్వాత తెలంగాణకు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అవి చెప్పకుండా కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై విమర్శలుచేస్తూ కాలం గడుపుతున్నారని వెల్లడించారు.
తెలంగాణ ప్రజలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని సీఎం కేసీఆర్(KCR)ను గెలిపిస్తే ఆయన మాత్రం దోపిడీయే లక్ష్యంగా పనిచేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ఆరోపించారు. తెలంగాణలో పరిపాలన చేయకుండా కేసీఆర్ రాష్ట్రాలు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. మరోవైపు రాష్ట్రంలో ప్రజల సమస్యలు పరిష్కరించకుండా కేంద్రాన్ని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.
దీంతోపాటు కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అనేక పరిశ్రమలు మూతపడినట్లు తెలిపారు. మూతపడే పరిస్థితుల్లో ఉన్న అనేక ఇండస్ట్రీలకు రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేయకుండా కేసీఆర్(KCR) దాటవేశారని గుర్తు చేశారు. మరోవైపు రాష్ట్రంలో అనేక పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలు కూడా ఇవ్వడం లేదన్నారు. వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 100 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. అంతేకాదు నిరుద్యోగులకు రూ.3016 భృతి ఇస్తామని చెప్పి ఉద్యోగార్థులను మోసం చేశారని వెల్లడించారు.