»Ys Avinash Reddy Filed Petition For Early Bail In Telangana Highcourt
YS Viveka Murder Caseలో ముందస్తు బెయిల్ కోసం ఎంపీ అవినాశ్ రెడ్డి దరఖాస్తు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కీలక మార్పులు తిరుగుతోంది. వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ తో ఆయన తనయుడు, ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్టవుతారనే వార్తలు వస్తున్నాయి. అరెస్ట్ భయంతో బెయిల్ పిటిషన్ వేశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్న వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టవగా.. నేడు అతడి కుమారుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాశ్ రెడ్డి (YS Avinash Reddy) మరోమారు సీబీఐ (CBI) విచారణ ఎదుర్కొననున్నారు. ఈ కేసులో అరెస్ట్ కు పాల్పడతారనే భయంతో అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్ (Bail Petition) దాఖలు చేశారు.
తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు. సీబీఐ విచారణ కోసం అవినాశ్ రెడ్డి కడప నుంచి హైదరాబాద్ కు బయల్దేరారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సీబీఐ కార్యాలయంలో విచారణకు అవినాశ్ ఐదోసారి హాజరు కానున్నారు. ఈ విచారణ నేపథ్యంలో తనను అరెస్ట్ చేసే అవకాశాలు ఉండడంతో అవినాశ్ రెడ్డి తనను అరెస్ట్ చేయకుండా హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను మధ్యాహ్నం 2.30 గంటలకు హైకోర్టు విచారణ జరపనుంది.
వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డిని సహ నిందితుడిగా విచారణకు చేర్చి విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, వివేకా కేసులోనే వైఎస్ భాస్కర్ రెడ్డి (YS Bhaskar Reddy), అవినాశ్ అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డి అరెస్టైన విషయం తెలిసిందే. వీరి కస్టడీ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో సోమవారం విచారణ జరగనుంది. భాస్కర్ రెడ్డికి 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్ విధించారు.