కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు లేవని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను నల్గొండ నుంచి బరిలోకి దిగుతానని ప్రకటించారు.
పరస్పరం విమర్శించుకోకుండా ప్రతిపక్షాలు కలిసి పోరాడాలి. ప్రతిపక్షాలు తన్నుకుంటే బీఆర్ఎస్ పార్టీ పండుగ చేసుకుంటుంది. తమ రెండు పార్టీల మధ్య గొడవలు, కలహాలు అధికార పార్టీకి లాభిస్తాయని విజయశాంతి పేర్కొన్నారు.
మునుగోడు బై పోల్‌లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ రూ.25 కోట్లు తీసుకుందని ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్ అగ్గిరాజేశాయి. తాము డబ్బులు తీసుకున్నట్టు భాగ్యలక్ష్మీ అమ్మవారి మీద ప్రమాణం చేయాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొనసాగుతున్న దాడులు, అరాచకాలపై ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారు. గతేడాది నవంబర్ లో ఇదే మాదిరి చంద్రబాబు కాన్వాయ్ పై దాడి జరిగింది. తాజాగా మరోసారి. అంతకుముందు బీజేపీ కీలక నాయకుడు సత్య కుమార్ పై కూడా వైసీపీ నాయకులు దాడి చేశారు. ఇక జిల్లాల్లో నాయకుల పరిస్థితిపై ఇదే తరహాలో దాడులు కొనసాగుతున్నాయని టీడీపీ భావిస్తోంది.
ఇటీవల కట్టడాలు, చారిత్రక ప్రదేశాల పేర్లు మార్చడం, రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించడం.. తాజాగా పాఠ్య పుస్తకాల్లో చరిత్రను మార్చడంపై మమతా బెనర్జీ స్పందించారు. ప్రజాస్వామ్యం వెళ్లిపోతే అప్పుడు ప్రతి ఒక్కరూ వెళ్లిపోతారు. కానీ ఇవాళ ఏకంగా రాజ్యాంగం మార్చేశారు.
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ సంచార ప్రచార వాహనాలు ఔరంగబాద్ జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించారు. ఈ ప్రచార రథాలకు మరాఠా ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తోందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొంటున్నారు.
తొలగించిన పాఠ్యాంశాన్ని యథావిధిగా పాఠ్య పుస్తకాల్లో ఉంచాలని బ్రేక్ త్రూ సైన్స్ సొసైటీ డిమాండ్ చేసింది. విద్యను కాషాయీకరణ చేసే కుట్రలో భాగంగా శాస్త్రీయ దృక్పథం కలిగిన పాఠ్యాంశాలు తొలగిస్తున్నారని ఆరోపించింది. ఇలాంటివి తొలగిస్తే విద్యార్థులకు నాణ్యమైన విద్య కొరవడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
అధికార పార్టీ బీఆర్ఎస్ (BRS Party) నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాల్లో అపశ్రుతులు చోటు చేసుకుంటున్నాయి. ఖమ్మం జిల్లాలో (Khammam District) ఘోర ప్రమాదంలో కార్యకర్తలు మృతి చెందిన సంఘటన మరువకముందే మరో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఓ కార్యకర్త గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. దీంతో బీఆర్ఎస్ పార్టీలో విషాదం అలుముకుంది. ఈ సంఘట...
కేసీఆర్ ను పంపిద్దామా? వద్దా?’ అని హరీశ్ రావు ప్రశ్నించారు. దీనికి కార్యకర్తలు ముక్తకంఠంతో ‘వద్దు.. వద్దు’ అని నినాదాలు చేశారు. ‘మళ్లీ మీకు కేసీఆర్ కావాలా? ’ అని హరీశ్ ప్రశ్నించగా.. ‘కావాలి.. కావాలి’ అంటూ కార్యకర్తలు కోరారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా గెలిచి తీరుతుందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. నారా లోకేశ్ మండుటెండలో కూడా పాదయాత్ర విజయవంతంగా నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. పాదయాత్రలో లోకేశ్ పరిపూర్ణమైన నాయకుడిగా రూపుదిద్దుకుంటున్నారని కొనియాడారు.
బీఆర్ఎస్(BRS) నుంచి డబ్బులు తీసుకున్నారన్న ఈటల ఆరోపణలపై రేవంత్ మండిపడ్డారు. రేపు సాయంత్రం 6 గంటలకు భాగ్యలక్ష్మి టెంపుల్ కి తాను వస్తానని, ఈటలను రమ్మన్నారు. బీఆర్ఎస్ నుంచి డబ్బులు తీసుకోలేదని తాను ప్రమాణం చేస్తానని.. ఈటల రాజేందర్ ను కూడా చేయాలన్నారు.