PM Modi Surprise Call To Karnataka BJP Veteran leader
PM Modi Surprise Call:కర్ణాటకలో బీజేపీ ఆచి తూచి మరీ టికెట్లను కేటాయించింది. సిట్టింగులను పక్కనపెట్టి కొత్తవారికి ఛాన్స్ ఇచ్చింది. చాలా మంది నేతలు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల్లో చేరారు. సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్పకు (KS Eshwarappa) కూడా బీజేపీ (BJP) హై కమాండ్ టికెట్ ఇవ్వలేదు. అయినప్పటికీ ఆయన పార్టీని వీడలేదు. దీంతో ప్రధాని మోడీ (MODI) ఆయనకు ఫోన్ కాల్ చేశారు.
ఈశ్వరప్ప (KS Eshwarappa) షిమొగ్గ నుంచి కర్ణాటక అసెంబ్లీకి ఐదుసార్లు ఎన్నికయ్యారు. ఈసారి టికెట్ ఇవ్వమని చెప్పినప్పటికీ.. పార్టీ నిర్ణయాన్ని గౌరవించారు. పార్టీ కోసం పనిచేస్తానని చెప్పారు. తనలాంటి వారికి ప్రధాని (PM) ఫోన్ చేయడం పట్ల ఈశ్వరప్ప (KS Eshwarappa) ఆనంద పడ్డారు. నేతలకు ఫోన్ చేసి మరీ మాట్లాడటం అభినంద దాయకం అన్నారు.
‘పార్టీ కోసం చిత్తశుద్దితో పనిచేస్తున్నారు. మీ గురించి తెలిసి చాలా సంతోషంగా ఉంది. అందుకే మీతో మాట్లాడాలని అనుకున్నాను. కర్ణాటక వచ్చిన సమయంలో తప్పకుండా కలుస్తా’ అని ఈశ్వరప్పతో మోడీ (MODI) చెప్పారు.
షిమొగ్గలో పార్టీ టికెట్ ఇచ్చిన వ్యక్తి కోసం తాను పనిచేస్తానని మోడీతో ఈశ్వరప్ప (KS Eshwarappa) తెలిపారు. కర్ణాటకలో తిరిగి బీజేపీ అధికారంలోకి తీసుకురావడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఈశ్వరప్ప తెలిపారు. తనకు మోడీ ఫోన్ చేస్తారని కలలో కూడా అనుకోలేదని చెప్పారు. ఈశ్వరప్పపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని.. అతనిని మోడీ ప్రశంసించడాన్ని విపక్ష కాంగ్రెస్ తప్పుపట్టింది.