»Dk Shivakumars Assets Rs 1414 Cr Increased By 68 Per Cent From 2018
Rs.1414 cr డీకే శివకుమార్ ఆస్తులివీ.. 2018 కంటే 68 శాతం పెరిగిన అసెట్స్
కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తన ఆస్తులను ప్రకటించారు. తను, కుటుంబ సభ్యుల పేర్లతో రూ.1414 కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పారు. గత ఎన్నికలతో పోలిస్తే డీకే ఆస్తులు 68 శాతం పెరగడం విశేషం.
DK Shivakumar's assets Rs.1414 cr, increased by 68 per cent from 2018
DK Shivakumar:కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులు నామినేషన్లు వేసిన సంగతి తెలిసిందే. ఒక్కో నేత ఆస్తులు బయటపడుతున్నాయి. గత ఎన్నికల సమయంలో సమర్పించిన ఆస్తులు కన్నా వేగంగా పెరిగాయి. కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ (DK Shivakuma) కూడా తన ఆస్తులను ప్రకటించారు. ఆయన ఆస్తులు కూడా 68 శాతం పెరగడం విశేషం. తాను, కుటుంబ సభ్యులు అందరీ ఆస్తుల విలువ రూ.1414 కోట్లుగా డీకే శివకుమార్ (DK Shivakuma) ప్రకటించారు.
2018లో డీకే శివకుమార్ (DK Shivakuma) ఆస్తులు రూ.840 కోట్లుగా చూపించారు. 2013లో రూ.250 కోట్లు (250 crores) అని పేర్కొన్నారు. అంతేకాదు తనకు 12 బ్యాంక్ ఖాతాలు (12 bank accounts) ఉన్నాయని వివరించారు. వాటిలో కొన్ని తన సోదరులు డీకే సురేష్తో (dk suresh) కలిసి జాయింట్ అకౌంట్ ఉన్నాయని పేర్కొన్నారు. తన పేరు మీద రూ.225 కోట్ల లోన్ (rs.225 crores) తీసుకున్నానని తెలిపారు. తన పేరు మీద ఒక టయోట కారు (toyota) మాత్రమే ఉందని తెలిపారు. ఆ కారు విలువ రూ.8.30 లక్షలు అని ప్రకటించారు.
వివిధ వ్యాపారాల ద్వారా తన వార్షిక ఆదాయం రూ.14.24 కోట్లు అని.. తన భార్య వార్షిక ఆదాయం రూ.1.9 కోట్లు అని పేర్కొన్నారు. డీకే శివకుమార్ (DK Shivakuma) ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ సారి కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే.. సీఎం పదవీ చేపట్టాలని భావిస్తున్నారు. తమ పార్టీ విజయం సాధించిన తర్వాత.. సీఎం అభ్యర్థిని (cm candidate) హై కమాండ్ నిర్ణయిస్తోందని తెలిపారు.