కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తన ఆస్తులను ప్రకటించారు. తను, కుటుంబ సభ్యుల పేర్లతో రూ.1414 కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పారు. గత ఎన్నికలతో పోలిస్తే డీకే ఆస్తులు 68 శాతం పెరగడం విశేషం.
పదవుల పందేరం ఇవ్వకుండా.. పార్టీ నాయకత్వం తమపై దృష్టి సారించకపోవడంతో హేమాజీ వర్గం అసహనం వ్యక్తం చేస్తోంది. దీంతో వివేక్ వర్గంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తన నియోజకవర్గంలో వివేక్ పెత్తనమేమిటని హేమాజీ ప్రశ్నిస్తున్నారు.
దేశంలో ప్రధాని మోదీపై (Narendra Modi), ఏపీలో సీఎం వైఎస్ జగన్ (YS Jagan) పాలనను విమర్శిస్తూ సీపీఐ (CPI) జాతీయ కార్యదర్శి కె. నారాయణ (K Narayana) ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోదీ, జగన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మోదీ బాబా 30 దొంగల్లా పాలన సాగుతున్నాయని విమర్శించారు. దేశంలో 30 మంది దత్తపుత్రులతో పాలన కొనసాగుతోందని ఆరోపించారు. గాంధీని చంపిన గాండ్సే నోటి నుంచి ఊడిపడిన వ్యక్తి మోదీ అంటూ తీవ్ర వ్యాఖ్య...
సుప్రీంకోర్టులో సునీత, అవినాష్ ఇద్దరికీ ఊరట కలిగింది. అవినాష్ ముందస్తు బెయిల్‌పై స్టే విధించింది. అవినాష్‌ను ఈ నెల 24వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని సీబీఐకి స్పష్టంచేసింది.
ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో అబ్దుల్ కలాం వ్యూ పాయింట్‌ని వైఎస్ఆర్ వ్యూ పాయింట్‌గా మార్చడంపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ కొండపై మలుపునకు గతంలో అసలు పేరే లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫాక్ట్ చెక్ ద్వారా ఈ మేరకు అసలు విషయాన్ని ప్రభుత్వం వెల్లడించింది. ఆ ప్రాంతం గతంలో ఎలాంటి అభివృద్ధికి కూడా నోచుకోలేదని తెలిపింది. అంతేకాదు జీ20 సదస్సుల నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని సుందరీకరణ చేసినట్లు...
రాష్ట్ర నాయకత్వం తీరుతోనే కొన్ని నెలలుగా తెలంగాణకు రావాల్సిన అమిత్ షా గైర్హాజరవుతున్నారు. ఆకస్మికంగా పర్యటనలు రద్దు చేసుకోవడానికి కారణం ఇదేనని తెలుస్తున్నది. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అని చెప్పినప్పుడు ఇలాగేనా వ్యవహరించేదని పార్టీ అధిష్టానం అక్షింతలు వేసే అవకాశం ఉంది.
ట్విట్టర్ బ్లూ టిక్ సబ్‌స్క్రైబ్ చేసుకోకపోవడంతో ప్రముఖులు బ్లూ టిక్ కోల్పోయారు. అమితాబ్, షారుఖ్, రాహుల్ గాంధీ, సీఎం జగన్, చంద్రబాబు, పవన్ తమ ఖాతాలకు బ్లూ టిక్ లాస్ అయ్యారు.
రాజకీయాల్లో ఉండాలంటే అన్నింటిపై అవగాహన తెలుసుకోవాలి. ఎక్కడికి వెళ్తే అక్కడి పరిస్థితులు, నాయకుల గురించి తెలుసుకోవాలి అని సూచిస్తున్నారు. ‘మొన్న తమ్మినేని వీరభద్రం చేసిన అవమానం మరచిపోయావా?’ మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి మే 5వ తేదిన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. నిరుద్యోగ నిరసన దీక్షలో ప్రియాంకా గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.
తెలంగాణలో మరో నిరుద్యోగ నిరసన దీక్ష(Unemployment protest)కు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో ఈనెల 28న నల్గొండ జిల్లాలోని మహత్మాగాంధీ యూనివర్సిటీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు.
బీజేపీ(BJP), వైసీపీ(YSRCP)కుమ్మకయ్యారంటూ టీడీపీ నేత అచ్చెన్నాయుడు(Atchannaidu) అభిప్రాయపడ్డారు. బయటకు మాత్రం ఈ రెండు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నట్లు నటిస్తున్నారని ఆయన ఆరోపించారు.