పార్టీకి జవసత్వాలు కల్పిస్తూ.. నిరాశలో ఉన్న పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం తీసుకొస్తూ.. సీఎం జగన్ (YS Jagan) పాలనతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ధైర్యం కల్పిస్తూ.. మేమున్నాం.. టీడీపీ (Telugu Desam Party) అధికారం వస్తుంది.. ధైర్యంగా ఉండాలని భరోసా కల్పిస్తూ యువ నాయకుడు నారా లోకేశ్ (Nara Lokesh) పాదయాత్ర కొనసాగిస్తున్నాడు. ఆయన చేపట్టిన యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) శుక్రవారంతో వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. కుప్పంలో (Kuppam) ప్రారంభించిన పాదయాత్ర విజయవంతంగా 77వ రోజుకు చేరుకుంది.
కర్నూలు జిల్లా (Kurnool District) ఆదోని (Adoni) నియోజకవర్గంలోని సిరిగుప్ప క్రాస్ వద్ద పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ పాదయాత్రలో ప్రజలతో మమేకమవుతూ సెల్ఫీలు తీసుకుంటూ ఉత్సాహంగా లోకేశ్ నడిచారు. వెయ్యి కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా పైలాన్ ను ఆవిష్కరించారు. అనంతరం ఎస్సీ సంఘం, ముస్లిం ప్రజలతో సమావేశమయ్యారు. అనంతరం లోకేశ్ మాట్లాడుతూ.. ‘మైనార్టీలపై సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు. మైనార్టీలపై (Minorities) ఎందుకంత కక్ష జగన్ రెడ్డి?’ అంటూ నిలదీశారు. ‘ఆరేకల్లులో (Arekallu) ప్రభుత్వ మైనార్టీ ఉర్దూ ఐటీఐ గురుకుల కళాశాలకు టీడీపీ ప్రభుత్వం హయాంలో రూ.7 కోట్లు నిధులు కేటాయించి, నిర్మాణ పనులు ప్రారంభించాం. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక అంగుళం కూడా ముందుకు పడలేదు. నాలుగేళ్లుగా నిర్మాణ పనులు చేపట్టడం లేదు. గతంలో ప్రారంభించిన పనులను కూడా పూర్తి చేయలేదని దద్దమ్మ సీఎం జగన్’ అని లోకేశ్ తీవ్రస్థాయిలో విమర్శించారు.