కాంగ్రెస్ లో మరోసారి గ్రూపు రాజకీయాలు భగ్గుమన్నాయి. పార్టీ ప్రకటించిన కార్యాచరణపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇష్టారాజ్యమొచ్చినట్టు వ్యవహరిస్తే ఇక తామెందుకు అని పార్టీ సీనియర్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. వీరి దెబ్బకు నల్లగొండలో నిర్వహించాల్సిన పార్టీ కార్యక్రమం వాయిదా పడింది.
సినీ ఇండస్ట్రీలో పైరసీని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా సినిమాటోగ్రఫీ చట్టాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపింది. దీంతో సినీ పరిశ్రమలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించి కేశినేని చిన్ని తేనేతుట్టేను కదిలించారు. ఇక్కడినుంచి చిన్ని సోదరుడు నాని ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే.
బీజేపీ, నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తరచూ తెలంగాణలో ఫ్లెక్సీలు ఏర్పాటవుతున్నాయి. కేంద్రం చేసిన మోసాలు, మోదీ సాగిస్తున్న కుట్ర, వివక్షపై ఫ్లెక్సీలు ఏర్పాటవుతున్న విషయం తెలిసిందే. బీజేపీ విషయంలో ప్రజలకు వాస్తవాలు చెప్పాలనే ఉద్దేశంతో ఆ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి.
ఈ ప్రతిపాదనకు సీఎం కేసీఆర్ అంగీకరించలేదు. తాము నిర్ణయించుకున్న చోటే నిర్వహించాలని పట్టుబట్టారు. దీనిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ సభను నిర్వహించి తీరాలని గులాబీ దళపతి ఉన్నారు.