Agniకి ఆజ్యం పోసిన చిన్ని.. విజయవాడ లోక్‌సభ నుంచి పోటీ చేస్తానని ప్రకటన
విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించి కేశినేని చిన్ని తేనేతుట్టేను కదిలించారు. ఇక్కడినుంచి చిన్ని సోదరుడు నాని ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే.
Will contest vijayawada parliament seat:Kesineni chinni
Kesineni chinni:గత కొంతకాలంగా యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉంటోన్న కేశినేని చిన్ని (Kesineni chinni).. విజయవాడ (vijayawada) లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తానని చెప్పారు. అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu) ఆదేశిస్తే పోటీకి సై అంటూ అగ్నికి ఆజ్యం పోశారు. ఇక్కడినుంచి ఆయన సోదరుడు కేశినేని నాని (nani) బరిలో ఉన్న సంగతి తెలిసిందే. రెండోసారి ఎంపీగా కొనసాగుతున్నారు. కొద్దీరోజుల నుంచి అన్నదమ్ములకు పడటం లేదు. ఇంతలో చిన్ని (chinni) ప్రకటన ప్రకంపనలు రేపే అవకాశం ఉంది.
విజయవాడ సీటు తనకు ఇచ్చిన ఫర్లేదు.. ఇతరులకు ఇస్తే సదరు అభ్యర్థి విజయం కోసం పనిచేస్తానని కేశినేని చిన్ని (Kesineni chinni) తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించడం.. చంద్రబాబును (chandrababu) సీఎం చేయడమే తమ లక్ష్యం అని వివరించారు. అందుకోసం కష్టపడి పనిచేస్తామని పేర్కొన్నారు. టికెట్ ఇస్తే వదులుకునే పరిస్థితుల్లో ఎవరూ లేరని చిన్ని (chinni) స్పష్టంచేశారు.
కేశినేని నాని, చిన్ని (Kesineni chinni) మధ్య పడటం లేదు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ (vijayawada seat) లోక్ సభ నుంచి పోటీ చేయాలని ఇద్దరు అనుకుంటున్నారు. ముచ్చటగా మూడోసారి పోటీ చేయాలని నాని అనుకుంటుంటే.. తనకు అవకాశం దక్కుతుందని చిన్ని (Kesineni chinni) భావిస్తున్నారు. ఇదే విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఇదివరకు కేశినేని నానికి (nani) అనుకూలంగా ఉన్న తిరువూరు టీడీపీ ఇంచార్జీ దేవదత్.. ఇప్పుడు చిన్ని (chinni) సన్నిహితుడిగా ఉన్నారు. దేవదత్ వేసిన డోర్ పోస్టర్లలో ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేశ్‌తోపాటు కేశినేని చిన్ని ఫోటో ముద్రించారు. అంతకుముందు ఆ ప్లేస్‌లో కేశినేని నాని బొమ్మ ఉండేది. ఇలా పలు అంశాలపై అన్నదమ్ముల మధ్య గొడవ జరుగుతోంది.