కర్నాటక మాజీ మంత్రి, కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ అధ్యక్షుడు గాలి జనార్ధన్ రెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది (SC rejects Gali Janardhan Reddy’s plea seeking relaxation in bail condition). గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసులో బెయిల్ నిబంధనలను సడలించాలని ఆయన భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించగా… అందుకు నిరాకరించింది. కర్ణాటకలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా బెయిల్ షరతును సడలించాలని ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీం కోర్టు బుధవారం తోసిపుచ్చింది (relaxation of bail condition in view of the upcoming Assembly elections in Karnataka). ఈ దరఖాస్తును స్వీకరించేందుకు న్యాయమూర్తులు ఎంఆర్ షా, సిటి రవి కుమార్‌లతో కూడిన ధర్మాసనం నిరాకరించింది.
కర్నాటకలో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో బెయిల్ షరతులను సడలించాలని సీనియర్ న్యాయవాది మీనాక్షి అరోరా కోర్టుకు విజ్ఞప్తి చేశారు. గాలి తన కుమార్తె, ఆమె నవజాత శిశువును సందర్శించడానికి ముందుగా సడలింపు ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో బళ్లారి వెళ్లేందుకు అనుమతి కోరారు. బెయిల్ నిబంధనలను సడలించడం కుదరదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో కర్నాటక ఎన్నికల తర్వాత మళ్లీ పిటిషన్ వేసేందుకు గాలి తరఫు లాయర్ అనుమతి కోరారు. ఆ విజ్ఞప్తిని కూడా న్యాయస్థానం తిరస్కరించింది.
అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డితో పాటు (former Karnataka minister and mining baron) మరో తొమ్మిది మంది పైన సీబీఐ 2009లో కేసు నమోదు చేసింది. 2011 సెప్టెంబర్ 5న జనార్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. 2015లో బెయిల్ మంజూరైంది. అక్రమ మైనింగ్ కేసు విచారణను స్థానిక కోర్టులో రోజువారీ ప్రాతిపదికన నిర్వహించాలని, నవంబర్ 6, 2022 వరకు గాలిని బళ్లారిలో ఉండటానికి అనుమతించాలని గతంలో సుప్రీం కోర్టు ఆదేశించింది. , అయితే 2022 నవంబర్ 7 నుండి ఈ విషయంలో విచారణ కొనసాగే వరకు బళ్లారిలో ఉండకూడదని ఖచ్చితంగా ఆదేశించింది.
నవంబర్ 9, 2022 నుండి రోజువారీ ప్రాతిపదికన విచారణను నిర్వహించాలని మరియు నవంబర్ 9, 2022 నుండి ఆరు నెలల వ్యవధిలో విచారణను తప్పకుండా ముగించాలని ట్రయల్ కోర్టును ఎస్సీ ఆదేశించింది. గాలిని కర్ణాటకలోని బళ్లారి, ఆంధ్రప్రదేశ్‌లోని కడప, అనంతపురం జిల్లాల్లో పర్యటించేందుకు, బస చేసేందుకు షరతులతో కూడిన అనుమతిని గతంలో కోర్టు రిలీవ్‌ను మంజూరు చేసింది. న్యాయస్థానం జనవరి 20, 2015 నాటి తన బెయిల్ ఆర్డర్‌ను సవరించింది. అతని పర్యటన మరియు అక్కడ ఉండడానికి అతని పరిమితులకు సంబంధించి అతని షరతులను సడలించింది. 2015లో బెయిల్ మంజూరైన సమయంలో ఈ జిల్లాలను సందర్శించకూడదని షరతు విధించింది. ఈ నేపథ్యంలో షరతుల సడలింపు కోసం పిటిషన్ దాఖలు చేయగా నో టెప్పింది.