నగరవాసుల కోసం తీసుకొచ్చిన డబుల్ డెక్కర్ బస్సులు(Double Decker Buses) ప్రస్తుతం ఖాళీగానే తిరుగుతున్నాయి. సిటీలో ఈ డబుల్ డెక్కర్ బస్సులు ఏ రూట్లలో తిరుగుతున్నాయో? వీటిలో తిరగడానికి ధర ఎంతో ఇంత వరకూ ఎవ్వరికీ సమాచారం(Information) తెలియడం లేదు. అందుకే ఈ బస్సులకు ఆదరణ కరువైనట్లు కనిపిస్తోంది. ట్విన్ సిటీ(Twin cities)ల్లో ఎన్నో ఏళ్ల క్రితమే డబుల్ డెక్కర్ బస్సులు వచ్చి అందరికీ ప్రత్యేకంగా కనిపించేవి. ఆ బస్సుల్లో కూర్చోని నగర అందాలను చూడటానికి అప్పట్లో అందరూ ఎంతో ఆసక్తి చూపేవారు.
ప్రస్తుతం ఈ బస్సులు సిటీలో తిరుగుతున్నాయని చాలా మందికి తెలియడం లేదు. ఈ బస్సులో నగరంలో తిరిగితే బావుంటుందని మంత్రి కేటీఆర్(KTR)కు వినతులు వెళ్లాయి. నెటిజన్స్(Netizens) నుంచి రిక్వెస్టులు రావడంతో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సుల(Double Decker Buses)ను నడపాలని ఆర్టీసీ(RTC) అధికారులు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు సిటీలోని రూట్లలో వీటిని తిప్పేందుకు కష్టమని ఆర్టీసీ అధికారులు తేల్చేశారు. అందుకే ఆ బాధ్యతను హెచ్ఎండీఏ(HMDA) తీసుకుని కార్యరూపం దాల్చాలని చూస్తోంది.
ఒక్కో డబుల్ డెక్కర్ బస్సు(Double Decker Buses)కు దాదాపుగా రూ.2 కోట్లు పెట్టి మొత్తం 6 బస్సులకు రూ.12 కోట్లు వెచ్చించింది. ఈ బస్సుల మెయింటెనెన్స్ కోసం నెలకు రూ.5 లక్షల వరకూ ఖర్చవుతోంది. అందుకే ముందుగా వీటిలో రెండు బస్సులను హెచ్ఎండీఏ(HMDA) నడిపింది. నెక్టెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్ ఏరియాల్లో రెండు నెలలకు ముందు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకూ సర్వీసులు ప్రారంభమయ్యాయి. ప్రతి బస్సును రెండు ట్రిప్పులు తిప్పుడూ వస్తోంది.
మొదట ఈ బస్సులను టికెట్లు తీసుకోకుండానే జాయ్ రైడ్ పేరుతో ఫ్రీగా తిప్పుతూ వచ్చింది. అయితే డబుల్ డెక్కర్ బస్సుల గురించి ప్రచారం లేకపోవడంతో జనాలెవ్వరూ వీటిలో ప్రయాణించేందుకు ముందుకు రావడం లేదు. ఈ బస్సులను చూసి సంబరపడుతున్నారే తప్పా ఎక్కే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. అటు అధికారులు సైతం డబుల్ డెక్కర్ బస్సు(Double Decker Buses)ల రూట్ మ్యాప్, స్టేజీల గురించి ప్రజలకు చెప్పడం లేదు. సమాచార లోపంతో ఈ బస్సులు ఉన్నా లేనట్టుగానే ఉంటున్నాయి.