IT Raids:టాలీవుడ్‌కు చెందిన ప్రముఖుల ఇళ్లు, నిర్మాణ సంస్థ కార్యాలయాల్లో ఈరోజు ఐటీ రైడ్స్ (IT Raids) జరుగుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ (mythri movie makers) ఆఫీసుల్లో సోదాలు జరుగుతున్నాయి. ఆ సంస్థ డైరెక్టర్లు నవీన్ (naveen), రవిశంకర్ (ravi shankar) ఇళ్లలో రైడ్స్ జరుగుతున్నాయని తెలిసింది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఇంటిలో కూడా ఐటీ రైడ్స్ జరుగుతున్నాయని సమాచారం.
మైత్రీ మూవీస్ సంస్థ (mythri movie makers) భారీ సినిమాలను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. మైత్రీకి చెందిన ప్రొడక్షన్ హైస్, ఇళ్లు, ప్రొడ్యూసర్స్ ఇళ్లు, కీలక సిబ్బంది ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు.
మైత్రీ మూవీస్‌కు (mythri movie) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు నిధులు సమకూరుస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఒకరికి మైనింగ్ బిజినెస్ కూడా ఉందని.. దీంతో మనీ ల్యాండరింగ్ జరుగుతుందా అనే కోణంలో దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయని తెలిసింది. ఇద్దరు ఎమ్మెల్యేలకు (two mla) అమెరికాలో వ్యాపారాలు (america business) కూడా ఉన్నాయట.
మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయంపై (mythri movie) ఐటీ దాడులపై ఆ సంస్థ స్పందించింది. తమ అకౌంట్లు అన్ని కరెక్ట్‌గా ఉన్నాయని.. రైడ్స్ అనేవి రొటిన్‌గా జరిగే ప్రక్రియే అని తెలిపింది. సంక్రాంతికి వచ్చిన చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. పుష్ప-2 మూవీ ప్రమోషన్ ప్రారంభించిన తర్వాత.. దర్యాప్తు సంస్థలు రైడ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ నెల 8వ తేదీన అల్లు అర్జున్ (allu arjun) బర్త్ డే సందర్భంగా అన్నీ మేజర్ న్యూస్ పేపర్లలో పుష్ప-2 ఫస్ట్ లుక్ పోస్టర్ వేశారు. ఫస్ట్ లుక్ కోసం ఇంత ఖర్చు చేశారా అని ఒక్కసారిగా చర్చకు వచ్చింది. ఇదివరకు చాలా పాన్ ఇండియా సినిమాలు వచ్చాయని.. ఎప్పుడూ ఈ స్థాయిలో ప్రచారం జరగలేదు. దీంతో ఏజెన్సీలు రైడ్ చేసేందుకు రంగంలోకి దిగాయి. మైత్రీతోపాటు ఇతర సంస్థలపై కూడా ఐటీ, ఈడీ దృష్టిసారించాయి.
శ్రీమంతుడు, జనతా గ్యారెజ్, రంగస్థలం, ఉప్పెన, పుష్ప సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. పుష్ప-2, భవదీయుడు భగత్ సింగ్, ఎన్టీఆర్ 31, రామ్ చరణ్‌తో మరో సినిమా తెరకెక్కిస్తున్నారు. వరసగా భారీ సినిమాలను నిర్మించడం.. ప్రచారం చేయడంతో ఐటీ అధికారులు దృష్టిసారించారు.