»A Rare Honor For Adipurush Movie Do You Know The Run Time
Adipurush: ‘ఆదిపురుష్’కు అరుదైన గౌరవం.. రన్ టైం ఎంతో తెలుసా!?
ప్రభాస్(prabhas)ను రాముడిగా చేసేందుకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. అయితే ఆదిపురుష్(Adipurush) టీజర్లో గ్రాఫిక్స్ చూసిన తర్వాత ఫ్యాన్స్‌కు డౌట్స్ పెరిగిపోయాయి. అందుకే సినిమాను ఆరు నెలలు పోస్ట్‌పోన్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఓం రౌత్ ఆదిపురుష్ అవుట్ పుట్ని మరింత బెటర్‌గా తీసుకొచ్చేందుకు ట్రై చేస్తున్నారు. ఇదిలా ఉండగానే.. ఆదిపురుష్ సినిమా అరుదైన గౌరవం దక్కించుకుంది.
జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఆదిపురుష్(Adipurush) సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనికి కాస్త ముందుగానే ఆదిపురుష్ స్పెషల్ ప్రీమియర్స్‌కు రెడీ అవుతోంది. జూన్ 13న అమెరికా(USA)లోని న్యూయార్క్‌లో జరిగే ట్రిబెకా ఫెస్టివల్(tribeca festival)లో ఆదిపురుష్ స్పెషల్ ప్రీమియర్ ప్రదర్శించనున్నారు. జూన్ 7 నుండి 18 వరకు ఈ ఫెస్టివల్ చాలా గ్రాండ్‌గా జరగనుంది. ఈ ఫెస్టివల్లో చోటు దక్కించుకున్న ఇండియన్ ఫస్ట్ ఫిల్మ్‌గా ఆదిపురుష్‌కు అరుదైన గౌరవం దక్కించుకుంది.
దీంతో ఆదిపురుష్ మేకర్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆదిపురుష్(Adipurush) రన్ టైం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమా 174 నిమిషాల రన్ టైమ్‌ను లాక్ చేసుకుందని సమాచారం. అంటే.. మూడు గంటలకు ఆరు నిమిషాలు మాత్రమే ఆదిపురుష్ నిడివి తక్కువగా ఉంది. మొత్తంగా ఆదిపురుష్‌ని థియేటర్లో చూడాలంటే మూడు గంటలకు పైగా థియేటర్లో సమయం కేటాయించాల్సిందే. త్వరలోనే ఆదిపురుష్ మరో టీజర్ లేదా సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటిస్తుండగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదత్త నాగే హానుమాన్గా నటిస్తున్నారు. కృతి సనన్ సీత పాత్రలో నటిస్తోంది. అజయ్, అతుల్ సంగీతం అందిస్తున్నారు. టీ సిరీస్ సంస్థ దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తోంది. మరి భారీ అంచనాలున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.