Ram Charan: నెక్స్ట్ స్టెప్.. రామ్ చరణ్ కొత్త IPL టీమ్!?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా రాణిస్తునే బిజినెస్ పరంగా దూసుకుపోతున్నాడు. అలాగే కమర్షియల్‌గాను చరణ్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. చరణ్ భార్య ఉపాసన(upasana) కూడా అపోలో హాస్పిటల్స్‌లో కీలక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఇలా ఇద్దరు బిజినెస్ పరంగా పెద్ద ఎత్తున సంపాదిస్తున్నారు. ఇన్కమ్ విషయంలో టాలీవుడ్ సెలబ్రిటీస్ టాప్ లిస్ట్‌లో వీళ్లే ఉన్నారు. అయితే ఇప్పుడు చరణ్ నెక్స్ట్ లెవల్ అనేలా కొత్త స్టెప్ తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. చరణ్ కూడా ఓ కొత్త ఐపిఎల్ క్రికెట్ టీమ్‌కు ఫ్రాంచైజీగా వ్యవహరించబోతున్నారట.
ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్డమ్ అందుకున్నాడు రామ్ చరణ్(Ram Charan). అతనితో సినిమాలు చేసేందుకు హాలీవుడ్ సంస్థలు సైతం ట్రై చేస్తున్నాయి. త్వరలోనే హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు చరణ్. ప్రస్తుతం శంకర్‌తో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత బుచ్చిబాబుతో ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఇక సినిమాల సంగతి ఇలా ఉంటే.. చరణ్‌కు ట్రూ జెట్ ఎయిర్ లైన్స్ ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు.
ఇక ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం ఓ కొత్త టీమ్(New IPL team)ను రంగంలోకి దింపబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే చరణ్ ఐపీఎల్ ఎంట్రీ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియా(social media)లో హల్ చల్ చేస్తోంది. ఇప్పటి వరకు తెలుగు నుంచి ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఉంది. అయితే ఇది తెలంగాణ స్టేట్ పరిగణలోకి వస్తుంది. అందుకే ఆంధ్రప్రదేశ్(ap state) నుంచి కొత్తగా ఐపీల్ టీమ్ కోసం కసరత్తులు చేస్తున్నాడట చరణ్. ఈ టీమ్‌కు వైజాగ్ వారియర్స్(vizag warriors) అనే పేరు కూడా పెట్టినట్లు సమాచారం.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన అండర్ గ్రౌండ్ వర్క్ జరుగుతోందట. వచ్చే ఏడాది నుంచే రామ్ చరణ్ ఐపీఎల్ టీమ్(IPL team) బరిలోకి దిగనుందని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. చరణ్ ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇస్తే మాత్రం.. బిజినెస్(business) పరంగా నెక్స్ట్ స్టెప్ పడినట్టే. అలాగే.. తెలుగు నుంచి ఫస్ట్ ఐపీఎల్ ఫ్రాంచైజీగా చరణ్ పేరు మార్మోగిపోనుంది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్స్ షారుఖ్, ప్రీతి జింతా లాంటి వారికి ఐపీఎల్ టీమ్స్ ఉన్న సంగతి తెలిసిందే.