Rashi: సీరియల్ పై ఫోకస్ పెట్టిన మైత్రీ మూవీ మేకర్స్..!
టెలివిజన్‌లో ఒక సినిమా నిర్మాణ సంస్థ సీరియల్‌ని నిర్మించడం చాలా అరుదుగా చూస్తాము. కానీ ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ, మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా జీ తెలుగులో సీరియల్లో భాగం కావడం విశేషం.
Rashi: టెలివిజన్‌లో ఒక సినిమా నిర్మాణ సంస్థ సీరియల్‌ని నిర్మించడం చాలా అరుదుగా చూస్తాము. కానీ ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ, మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా జీ తెలుగులో సీరియల్లో భాగం కావడం విశేషం. ఈ సీరియల్‌కి మా అన్నయ్య అనే టైటిల్ పెట్టారు. ఈ సీరియల్ అధికారిక పోస్టర్ జీ తెలుగు X ఖాతాలో అధికారికంగా విడుదలైంది. పోస్టర్లో వివిధ వయసులకు చెందిన నలుగురు మహిళలు ఉన్నారు. వీరికి తల్లిగా టాలీవుడ్ నటి రాశి నటిస్తోంది. మరి ఇది అన్నా చెల్లెల్ల రిలేషన్ షిప్ డ్రామా అని అర్థం చేసుకోవచ్చు. మైత్రీ మూవీ మేకర్స్ టీవీ ప్రొడక్షన్లోకి అడుగుపెట్టడం వెనుక ఖచ్చితమైన కారణం ఎవరికీ తెలియదు. అయితే దీనిపై టీమ్ ఎలాంటి సమాధానం చెబుతుందో వేచి చూడాలి.
మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాలైన పుష్ప, ఉస్తాద్ భగత్ సింగ్ కోసం పని చేస్తోంది. రీసెంట్గా లాంచ్ అయిన టోవినో థామస్‌తో సినిమాతో మలయాళంలోకి కూడా అడుగుపెడుతున్నారు. వారు రామ్ చరణ్ మరో భారీ బడ్జెట్ చిత్రం RC16 కోసం వృద్ధి సినిమాస్‌తో కలిసి పనిచేస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక ఇటీవలే అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మూవీకి సంగీతాన్ని ఆస్కార్ అవార్డు గెలుచుకున్న స్వరకర్త A.R. రెహమాన్ అందిస్తుండటం విశేషం. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.