»Ntr Prabhas And Ram Charans Films Will Not Release This Summer
NTR: సమ్మర్లో సైడ్ అయిన స్టార్స్.. ఇక వీళ్లదే జోరు!
మామూలుగా అయితే సమ్మర్లో స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అయిపోగానే.. బడా హీరోల సినిమాలు థియేటర్లోకి వరుస క్యూ కడుతుంటాయి. కానీ ఈసారి మాత్రం పెద్ద హీరోల సినిమాలు సైడ్ అయిపోయాయి. దీంతో యంగ్ హీరోలదే హవా కనిపిస్తోంది.
NTR, Prabhas and Ram Charan's films will not release this summer
NTR: ఈసారి సమ్మర్లో పెద్ద సినిమాలు ఏవి రిలీజ్ కావడం లేదు. వాస్తవానికైతే.. యంగ్ టైగర్ దేవర ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూటింగ్ డిలే కారణంగా దసరాకు షిప్ట్ అయ్యాడు దేవర. అలాగే.. మే 9న ప్రభాస్ నటిస్తున్న కల్కి రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఎలక్షన్స్ కారణంగా కల్కి కూడా పోస్ట్ పోన్ కానుందనే టాక్ నడుస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా సమ్మర్ సీజన్ నుంచి తప్పుకోవడంతో.. ముగ్గురు యంగ్ హీరోలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. సమ్మర్లో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ.. సిద్ధు జొన్నలగడ్డ, విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్ సినిమాలకు మంచి బజ్ ఉంది. ముందుగా సమ్మర్ సీజన్ టిల్లుగాడితో స్టార్ట్ కానుంది. డీజె టిల్లు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న టిల్లు స్క్వేర్ మార్చి 29న రిలీజ్ కానుంది.
ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు టిల్లుగాడు. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్న టిల్లు స్క్వేర్ పై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక ఆ తర్వాత విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అవుతుంది. దేవర డేట్‌ను టార్గెట్ చేస్తూ.. ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ థియేటర్లోకి వస్తోంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా.. పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తోంది. దీంతో ఫ్యామిలీ స్టార్ పై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక సమ్మర్ సీజన్‌కు ఎండ్ కార్డ్ వేసేలా మే 17న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా వస్తోంది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై కూడా మంచి బజ్ ఉంది. ఇంకా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్న కూడా.. సమ్మర్లో వీళ్లదే హవా అని చెప్పాలి.