సెలబ్రిటీస్ వాడే ఫోన్లు, వాచ్‌లు, డ్రెస్సులు.. ఇలా చెప్పులు మొదలుకొని కళ్ల జోడు వరకు వాడే వస్తువుల రేట్లు మామలూగా ఉండవు. లేటెస్ట్గా మెగాస్టార్ చిరంజీవి వాచ్ రేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంతకీ మెగాస్టార్ వాచ్ రేట్ ఎంత?
Shocking megastar watch rate? What are the coats Sami?
Chiranjeevi: వాడుతుంటారు మన హీరోలు. ఒక్కోసారి వాటి రేట్ చూస్తే దిమ్మతిరిగిపోవడం గ్యారెంటీ. గతంలో చాలామంది హీరోల చేతికున్న ఖరీదైన వాచ్‌లు చూశాం. అయితే.. ఇప్పుడు మోగాస్టార్ చేతికున్న వాచ్ రేట్ చూస్తే.. షాక్ అవడం గ్యారెంటీ. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకకి ఎంతోమంది స్టార్స్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. పద్మవిభూషణ్ అందుకున్న సందర్భంగా.. సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ వేదిక పై మెగాస్టార్‌ను సత్కారం చేశారు సినీ ప్రముఖులు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో చిరంజీవి చేతికి ఉన్న వాచ్ స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి.
దీంతో.. అది ఏ బ్రాండ్, రేట్ ఎంత అని సెర్చ్ చేయగా.. నెటిజన్స్ దిమ్మ తిరిగిపోయలా ఉంది. చిరంజీవి చేతికున్న వాచ్ రోలెక్స్ కంపెనీకి చెందిందని తేలింది. ‘కాస్మోగ్రాఫ్ డేటోనా ఐ ఆఫ్ ది టైగర్’ పేరుతో పిలిచే ఈ వాచ్ ధర.. దాదాపు ఒక కోటి 90 లక్షలు వరకూ ఉంటుందని అంచనా. ఇందులో మోడల్స్ బట్టి రేటులో కాస్త మార్పులు కూడా ఉన్నాయి. చూడటానికి చాలా సింపుల్‌గా కనిపిస్తున్నప్పటికీ.. ఈ వాచ్ ధర దాదాపు రెండు కోట్లు అంటే మాటలు కాదు. అత్తారింటికి దారేది సినిమాలో పవర్ స్టార్ వాచ్‌తో లైఫ్ సెటిల్ అయిపోతుందని చెప్పినట్టుగా.. మెగాస్టార్ వాచ్‌తో నిజంగానే లైఫ్ టైం సెటిల్మెంట్ అయిపోతుందనే చెప్పాలి. ఏదేమైనా.. అక్కడుంది మెగాస్టార్ కాబట్టి.. ఆ మాత్రం ఉంటుందిలే.. అంటున్నారు మెగా ఫ్యాన్స్.