ఈ సమ్మర్లో రావాల్సిన పెద్ద సినిమా ఏదైనా ఉందా? అంటే, అది ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడి మాత్రమే. కానీ ఈ సినిమా కూడా దాదాపుగా వాయిదా పడినట్టేనని తెలుస్తోంది. ఇందుకు రెండు కారణాలు చెబుతున్నారు.
Kalki 2898 AD: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీ కల్కి 2898 ఏడి. ఈ మూవీ పై డార్లింగ్ ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్ అందరిలోను భారీ అంచనాలు ఉన్నాయి. వైజయంతి మూవీస్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తోంది. కొడితే కుంభ స్థలాన్ని కొట్టాలన్నట్టుగా ఈ సినిమా చేస్తున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అందుకే.. ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా కల్కిని విజువల్ వండర్‌గా రూపొందిస్తున్నాడు. ఈమూవీలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుండగా.. కీలక పాత్రల్లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని నటిస్తున్నారు. అయితే.. మే 9న రావాల్సిన కల్కి సినిమా వాయిదా పడినట్టుగా ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ పోస్ట్ పోన్ అయినట్టేనని అంటున్నారు. ముందుగా ఎలక్షన్స్ కారణంగా వాయిదా పడుతుందని వినిపించించింది.
కానీ లేటెస్ట్గా ఇంకా కల్కి సీజి వర్క్ కంప్లీట్ కాలేదని తెలుస్తోంది. ఈ రెండు కారణాల వల్ల కల్కి వాయిదా పడడం పక్కా అంటున్నారు. కల్కి పోస్ట్ పోన్ పై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావడం ఒక్కటే లేట్ అంటున్నారు. అయితే.. ఈ సినిమా ఎప్పుడొచ్చినా కూడా టాలీవుడ్‌ని మరో మెట్టు పైకి తీసుకెళ్లడం గ్యారెంటీ అని అంటున్నారు. ముఖ్యంగా బాహుబలి లాగే ప్రభాస్ పాత్ర భైరవ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.. అని అంటున్నారు. ఇదే విషయాన్ని కల్కి నిర్మాత స్వప్న దత్ చెప్పుకొచ్చింది. కల్కి మూవీలో ప్రభాస్ చేస్తున్న భైరవ పాత్ర ఎప్పటికీ ఆడియన్స్ మదిలో గుర్తుండిపోతుందని, అలాగే తన పాత్రలో ప్రభాస్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసారని.. అన్నారు. ఈ స్టేట్మెంట్తో కల్కి పై ఉన్న అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. మరి కల్కి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.