Rashmika: ఒక్క ఫొటో చాలు.. జూమ్ ఇన్ చేసి సొల్లు కార్చుతారు!
బుల్లి తెర యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లి తెరపై హీరోయిన్ రేంజులో రచ్చ రష్మీ.. సోషల్ మీడియాలోను అదే రేంజ్లో రచ్చ చేస్తుంటుంది. తాజాగా రష్మిక ఓ నెటిజన్‌కు ఇచ్చిన రిప్లై వైరల్‌గా మారింది.
Rashmika: రష్మీ గౌతమ్ గురించి చెప్పాలంటే.. అమ్మడు పలు క్రేజీ షోలతో బుల్లితెరను షేక్ చేస్తోంది. ఒక్కో షోకి రష్మి గౌతమ్ రూ.1.5 నుంచి 2 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందనే టాక్ ఉంది. అయితే.. యాంకర్‌గా రష్మీ ఎంత ఫేమస్‌గా ఉంటుందో.. సుడిగాలి సుధీర్ ప్రేమ విషయంలోను అంతే ఫేమస్ రష్మీ గౌతమ్. ఎందుకంటే.. ఆన్ స్క్రీన్‌లో సుధీర్, రష్మీ రొమాన్స్ చూసి.. ఆఫ్ స్క్రీన్‌లోను ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారని గట్టిగా నమ్ముతున్నారు జనాలు. కానీ ఈ విషయంలో ఎప్పుడు ఓపెన్ అవడం లేదు సుధీర్, రష్మీ. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మిక.. ఎప్పుడూ కూడా ఏదో ఒక కాంట్రవర్శీ పోస్ట్‌లు పెడుతు ఉంటుంది. అలాగే.. తన అభిమానులతో టచ్‌లో ఉంటుంది. అయితే.. ఎవ్వరైనా తేడాగా మాట్లాడితే మాత్రం రష్మీ అస్సలు ఊరుకోదు. గత కొద్ది రోజులుగా జొమాటో గ్రీన్ టీ షర్టు వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. జొమాటో డెలివరీ బాయ్స్ రెడ్ టీ షర్ట్‌కు బుదులుగా.. వెజ్ డెలివరీ సమయంలో గ్రీన్ టీ షర్ట్స్ ధరించాలనేది దీని కాన్సెప్ట్. అయితే.. ఇది నాన్ వెజ్ తినే వారిని అవమానించడమేనంటూ వివాదం మొదలైంది.
దీంతో జొమాటో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇదే విషయాన్నిరష్మీ ప్రశ్నించింది. ఎవరైనా దయచేసి వివరించండి.. ఇది ఏ విధంగా నాన్ వెజ్ తినే వారి మనోభావాలు దెబ్బతీస్తుంది? అంటూ కామెంట్ చేసింది. ఈ విషయంలో ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఇవన్నీ అటెన్షన్ రీచ్ కోసం పడే కష్టాలు అంటూ కామెంట్ చేశాడు. దానికి రష్మీ దిమ్మతిరిగిపోయే కౌంటర్ ఇచ్చింది. రీచ్ కోసం నేను ఈ సమస్యల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక్క ఫోటో చాలు జూమ్ ఇన్ చేసి చేసి మరీ సొల్లు కార్చుతు అవసరం లేని అటెన్షన్ ఇస్తారు. ఇప్పుడు నీకు కావాల్సిన అటెన్షన్ ఇప్పుడు దొరికేసిందని ఆశిస్తున్నాను.. మీ నిరీక్షణ ఎంతసేపు ఉందో.. నేను ఆశ్చర్యపోతున్నాను.. అంటూ రిప్లే ఇచ్చింది. దీంతో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.