IT Raids : చెప్పుల వ్యాపారుల ఇంట్లో పరుపులు, మంచాల్లో దాచిన భారీ నోట్ల కట్టలు.. సీజ్
ఆదాయపు పన్ను శాఖ చెప్పుల వ్యాపారుల ఇళ్లలో జరుపుతున్న సోదాల్లో భారీ మొత్తం డబ్బులు పట్టుబడ్డాయి. ఓ వ్యాపారి ఇంట్లో దొరికిన డబ్బును లెక్కపెట్టలేక క్యాష్ మెషీన్లు సైతం మొరాయించాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
IT Raids On Agra Shoe Traders Houses : ముగ్గురు చెప్పుల వ్యాపారులకు సంబంధించిన ఇళ్లు, వారికి సంబంధించిన ప్రాంతాల్లో ఐటీ( IT) అధికారులు రైడ్స్( RAIDS) జరిపారు. యూపీ. ఆగ్రాలో(AGRA) ఈ రైడ్స్ చోటు చేసుకున్నాయి. కేవలం 42 గంటల్లో వారు రూ.100 కోట్ల డబ్బును సీజ్ చేశారు. ఓ చెప్పుల వ్యాపారి ఇంట్లో అయితే మంచాలు, అల్మరాలు, షూ బాక్సులు, బ్యాగులు ఇలా ఎక్కడ చూసినా రూ.500 నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా కనిపించాయి. అవి ఎంత మొత్తం ఉందనేది లెక్కించడానికి తీసుకొచ్చిన క్యాష్ మెషీన్లు కూడా పని చేయడం మానేశాయి. అంత డబ్బును లెక్కించలేక మొరాయించాయి.
ఈ వ్యాపారుల ఇళ్లల్లో డబ్బులతో పాటుగా బంగారం, వెండి ఆభరణాలు, కోట్లు విలువ చేసే భూములకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు సీజ్ చేశారు. ఇప్పటి వరకు తేలిన లెక్క ప్రకారం వీటన్నింటి విలువ రూ.100 కోట్లు ఉంటుందని ఐటీ అధికారులు వెల్లడించారు. లెక్కలన్నీ పూర్తయిన తర్వాత ఆ విలువ ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు.
ధాక్రాన్‌కు చెందిన మన్షు ఫుట్‌వేర్, ఆసఫోటిడా మండికి చెందిన హర్మిలాప్ ట్రేడర్స్, ఎమ్జీ రోడ్‌కు చెందిన బీకే షూస్ చెప్పుల వ్యాపారుల ఇళ్లు(SHOES BUSINESSMANS HOUSES), కార్యాలయాలయాల్లో అధికారులు ఏకకాలంలో రైడ్స్ నిర్వహించారు. ఇంత పెద్ద మొత్తంలో అక్రమ ఆస్తులు బయట పడటంతో అధికారులు ఖంగు తిన్నారు. రెండు రోజుల క్రితం ప్రారంభం అయిన పట్టుబడిన డబ్బుల లెక్కింపు ఇప్పటికీ ఇంకా పూర్తి కాలేదు. హర్మిలాప్ ట్రేడర్స్ యజమాని రామ్‌నాథ్ డంగ్‌కు సంబంధించిన ఇంట్లో అయితే మంచాలు, పరుపులు, వాషింగ్ మెషీన్లు, బ్యాగులు, సీక్రెట్ వాల్ లాకర్లు, షూ బాక్సుల్లో అయితే భారీగా డబ్బు కట్టలు బయటపడ్డాయి.