CBI 10 questions:వైఎస్ వివేకానంద ( Viveka) హత్య కేసులో వైఎస్ అనివాష్ రెడ్డి (avinash), ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి (bhaskar reddy), ఉదయ్ కుమార్ రెడ్డిని (uday kumar reddy) కలిపి విచారించింది. కాసేపటి క్రితం భాస్కర్, ఉదయ్ విచారణ ముగియగా.. అవినాష్ రెడ్డిపై ప్రశ్నలు సంధిస్తోంది. ముగ్గురిని కలిపి 10 ప్రశ్నలపై ఆరా తీసినట్టు తెలిసింది.
వివేకానంద ( Viveka) గుండెపోటుతో చనిపోయారని ఎందుకు ప్రచారం చేశారని ముగ్గురిని కలిపి సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఈ ప్రశ్నతో సీబీఐ విచారణ ఈ రోజు ప్రారంభమైంది. సాక్ష్యాలను ఎందుకు తారుమారు చేశారు అని కొశ్చన్ చేసింది. వివేకానంద ( Viveka) గాయాలు కనిపించకుండా బ్యాండేజ్ ఎందుకు వేశారు అని ముగ్గురిని కలిపి అడిగింది.
హత్య జరిగిన రోజు ఉదయ్ కుమార్ రెడ్డి మీ ఇంట్లో ఎందుకు ఉన్నాడని అవినాష్, భాస్కర్ రెడ్డిని గుప్పతిప్పుకోకుండా ప్రశ్నించింది. సునీల్ యాదవ్, ఉదయ్ కుమార్ రెడ్డితో మీకు ఏం సంబంధం అని నిలదీసింది.
హత్య జరిగిన రోజే ఇంట్లో ఉండి మరో చోట ఉన్నానని ఎందుకు చెప్పారంటూ.. వివేకానందరెడ్డితో ( Viveka) విభేదాలు ఉన్నాయా అంటూ ప్రశ్నల పరంపర కొనసాగించింది. రూ.40 కోట్ల డీల్‌పై ఏమంటారు.. ఎవరు డబ్బులు ఇచ్చారు. మీరు చెబితే హత్య చేశానని దస్తగిరి (dastagiri) చెబుతున్నాడు కదా అని అవినాష్‌ను (avinash) అడిగింది. ఇన్నాళ్లూ లేని వివాహేతర సంబంధాలు ఇప్పుడెందుకు తీసుకొచ్చారు అవినాష్ (avinash) అని అడిగారు.
భాస్కర్, ఉదయ్ విచారణ ముగియడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు. రేపు మళ్లీ విచారిస్తారు. మరోవైపు ఈ రోజు భాస్కర్ రెడ్డి (bhaskar reddy) బీపీ పెరగడంతో అస్వస్థతకు గురయ్యారు. జైలులోనే చికిత్స అందజేసి.. విచారణకు తీసుకొచ్చారు.