ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jaganmohan Reddy) యూరప్ టూర్(Europe Tour)కు వెళ్లనున్నారు. ఈ టూర్కు వెళ్లడానికి ఆయనకు సీబీఐ కోర్టు (CBI Court) అనుమతించింది. కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ టూర్ వెళ్లే విషయాన్ని సీఎం జగన్ కోర్టుకు విన్నవించారు. ఈ విషయంలో ఆయన విన్నపాన్ని విన్న కోర్టు యూరప్ వెల్లేందుకు అనుమతించింది.
తన వ్యక్తిగత పర్యటనకు సంబంధించి అనుమతిని కోరుతూ సీఎం జగన్(CM Jagan) సీబీఐ కోర్టు(CBI Court)లో పిటిషన్ వేశారు. దేశం విడిచి వెళ్లరాదనే బెయిల్ షరతును సడలించాలంటూ జగన్ కోర్టును కోరారు. సీఎం జగన్ పిటిషన్పై కోర్టు తీర్పునిచ్చింది. ఏప్రిల్ 17వ తేదిన ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయగా మంగళవారం కోర్టులో దానిపై వాదనలు ముగిశాయి.
ఈ నేపథ్యంలో ఏప్రిల్ 21వ తేది నుంచి 29వ తేది వరకూ జగన్ యూరప్ టూర్(Europe Tour)కు వెళ్లేందుకు సీబీఐ కోర్టు(CBI Court) జగన్(Jagan)కు అనుమతించింది. అయితే యూరప్ పర్యటనకు ముందుగా జగన్ తన మొబైల్ ఫోన్, ఈ మెయిల్ ఐడీ, పర్యటన వివరాలను కోర్టుకు, సీబీఐకి ఇవ్వాలని కోర్టు ఆదేశాలిచ్చింది. సీబీఐ కోర్టు యూరప్ టూర్కు అనుమతివ్వడంతో సీఎం జగన్(CM Jagan) ఆనందం వ్యక్తం చేశారు.