Vamsi fires chintamaneni:టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌పై (chintamaneni prabhakar) గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ (vallabhanani vamsi mohan) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన వంశీ (vamsi).. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలోకి దిగే అవకాశం ఉంది. అక్కడి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసేందుకు 10 మంది అభ్యర్థులు ఉన్నారని ప్రభాకర్ (prabhakar) కామెంట్స్ చేశారు. ఆ వ్యాఖ్యలపై వంశీ (vamsi) కౌంటర్ ఇచ్చారు.
చింతమనేని ప్రభాకర్ (chintamaneni prabhakar) ముందు తన నియోజకవర్గ పరిస్థితి చూసుకోవాలని సూచించారు. గత ఎన్నికల్లో తాను టీడీపీ గుర్తుపై గెలిచిన మాట నిజమేనని వంశీ (vamsi) అంగీకరించారు. మరీ అదే గుర్తుతో ప్రభాకర్ (prabhakar) ఎందుకు గెలవలేదు అని వంశీ (vamsi) అడిగారు. తనకు సొంత ఇమేజ్ ఉందని వంశీ చెప్పకనే చెప్పారు.
కోడిపందేలు ఆడించుకోవడానికి పర్మిషన్ ఇప్పించాలని కొడాలి నానిని (kodali nani) చింతమనేని ప్రభాకర్ (prabhakar) అడగలేదా అని వంశీ (vamsi) గుర్తు చేశారు. తాను చంద్రబాబు (chandrababu) స్కూల్ నుంచి వచ్చానని.. ఎన్నికల సమయంలో రాజ్యసభ సీట్లను చంద్రబాబు ఎలా అమ్ముకుంటారో తెలుసని చెప్పారు.
గన్నవరం నుంచి పోటీ చేయాలని నారా లోకేశ్‌కు (nara lokesh) సవాల్ విసిరానని వంశీ గుర్తుచేశారు. తన సవాల్‌పై ఇంతవరకు లోకేశ్ (lokesh) స్పందించలేదని చెప్పారు. వైసీపీ వెంటిలేటర్‌పై లేదని.. తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్‌పై ఉందని వివరించారు.
గత ఎన్నికల్లో వంశీ (vamsi) టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత వైసీపీలో చేరాలని అనుకున్నారు. సీఎం జగన్ (jagan) మాత్రం.. ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసి రావాలని అనడంతో.. వాయిదా పడింది. టీడీపీ సభ్యుడిగా ఉన్నప్పటికీ.. చంద్రబాబు (chandrababu), లోకేశ్ (lokesh), పార్టీపై (party) విమర్శలు చేస్తూనే ఉంటారు.