చంద్రబాబు(Chandrababu)ను కలవడానికి వెళ్లాలనుకున్న పవన్ కళ్యాణ్‌కు పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయన ప్రత్యేక విమానానికి అనుమతి ఇవ్వవద్ధని ఏపీ పోలీసులు గన్నవరం (Gannavaram) ఎయిర్ పోర్టు అధికారులను కోరారు. బాబును కలిసేందుకు కేవలం కుటుంబ సభ్యులకి అనుమతి ఇస్తామని చెప్పారు. కాగా చంద్రబాబును కలిసేందుకు పవన్ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాలను భావిస్తున్నారు.చంద్రబాబును తీసుకెళ్తున్న కాన్వాయ్‌ను టీడీపీ (TDP) కార్యకర్తలు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. చిలకలూరిపేట మొదలు ప్రతిచోట టీడీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయిస్తూ నిరసన తెలుపుతున్నారు.
మంగళగిరి తెలుగుదేశం కార్యాలయం, ఆ తర్వాత జనసేన (Janasena) కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. తీవ్ర ఉద్రిక్తల మధ్య చంద్రబాబు కాన్వాయ్ తాడేపల్లి (Tadepalli) సిట్ కార్యాలయానికి చేరుకుంది. ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లనున్న పవన్ కల్యాణ్(Pawan Kalyan).. అనంతరం చంద్రబాబును కలుస్తానని పేర్కొన్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పవన్ కల్యాణ్ ప్రత్యేక విమానానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. పవన్ స్పెషల్ ఫ్లైట్‌కు పర్మిషన్ ఇవ్వొద్దని ఎయిర్ పోర్ట్ ఆథారిటీ అధికారులను పోలీసులు కోరారు.ఇక, మరికొద్ది సేపట్లో చంద్రబాబును సీఐడీ (CID) పోలీసులు విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. చంద్రబాబు తరుఫున వాదనలు వినిపించేందుకు టీడీపీ ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా(Siddharth Luthra)ను రంగంలోకి దింపింది. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఏపీలో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి.