ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో అబ్దుల్ కలాం వ్యూ పాయింట్‌ని వైఎస్ఆర్ వ్యూ పాయింట్‌గా మార్చడంపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ కొండపై మలుపునకు గతంలో అసలు పేరే లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫాక్ట్ చెక్ ద్వారా ఈ మేరకు అసలు విషయాన్ని ప్రభుత్వం వెల్లడించింది.
ఆ ప్రాంతం గతంలో ఎలాంటి అభివృద్ధికి కూడా నోచుకోలేదని తెలిపింది. అంతేకాదు జీ20 సదస్సుల నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని సుందరీకరణ చేసినట్లు చెప్పింది. ఈ నేపథ్యంలో ఆ మలుపు ప్రాంతాన్ని పూర్తిగా వైఎస్సార్ ప్రభుత్వమే అభివృద్ధి చేసినట్లు స్పష్టం చేసింది. అభివృద్ధి చేసిన తర్వాతనే నామకరణం కోసం జీవీఎంసీకి దరఖాస్తు చేసినట్లు తెలిపింది. దీంతో ప్రతిపక్ష పార్టీల నుంచి వచ్చిన విమర్శలకు అధికార వైఎస్సార్ పార్టీ చెక్ పెట్టినట్లైంది. ఈ క్రమంలో అభివృద్ధి జరగక ముందు, అభివృద్ధి జరిగిన తర్వాత చేసిన ఉన్న చిత్రాలను సైతం ప్రభుత్వం విడుదల చేసింది.