బీజేపీ(BJP), వైసీపీ(YSRCP)కుమ్మకయ్యారంటూ టీడీపీ నేత అచ్చెన్నాయుడు(Atchannaidu) అభిప్రాయపడ్డారు. బయటకు మాత్రం ఈ రెండు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నట్లు నటిస్తున్నారని ఆయన ఆరోపించారు.
టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు(Atchannaidu).. అధికార పార్టీ వైసీపీ(YSRCP)పై విమర్శల వర్షం కురిపించారు. వైసీపీతో పాటు.. బీజేపీ(BJP) నేతలను కూడా ఆయన ఏకిపారేశారు. ఈ రెండు పార్టీలకు సంబంధం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తమ రెండు పార్టీలు ఒకటి కాదు అని ప్రజలు నమ్మాలని వారు చూస్తున్నారని… కానీ వారి విషయం ప్రజలకు తెలుసు అని ఆయన అన్నారు.
టీడీపీ(TDP) అధికారంలోకి రావడం ఖాయమని అందరికీ అర్థమైందన్నారు. గతంలో అవమానించిన వారు.. అవహేళన చేసినవారు.. ఇప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబును ఎవరు విమర్శించినా ప్రజలు ఛీ కొడుతున్నారని తెలిపారు. ప్రజల్లో మార్పు చూసి.. గతంలో విమర్శించిన వాళ్లల్లో భయంతో కూడిన మార్పు వచ్చిందన్నారు.
జగన్ పచ్చి అబద్దాలకోరని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో సీఎంకు చెందిన మరో బాబాయ్ ని అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. వైఎస్ వివేకా హత్యపై జరుగుతోన్న చర్చను పక్క దారి పట్టించేందుకే జగన్(jagan) కామెంట్లు చేస్తున్నారని వెల్లడించారు. ఉత్తరాంధ్రకు తాము ఏం చేశామో వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం.. వైసీపీ ఏం చేసిందో చెప్పగలరా..? అని సవాల్ చేశారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు చంద్రబాబే ఎక్కువ ఖర్చు చేశారని ఇరిగేషన్ ఈఎన్సీనే చెప్పారని గుర్తు చేశారు.