కర్ణాటకలో ఎన్నికల ప్రచారం జరుగుతుండగా ఎమ్మెల్యే ఎంబీ పాటిల్ ఓ యువకుడిపై చేయిచేసుకున్నాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) కాంగ్రెస్ పార్టీపైనా, టీపీసీసీ చీఫ్ పైనా బురద జల్లడాన్ని ఆయన ఖండించారు. ఈ సందర్భంగా భట్టి ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ప్రజలలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఉండకూడదని బీజేపీ, బీఆర్ఎస్(BJP,BRS) పార్టీలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.
తన పీసీపీ పదవి పోతుందన్న భయంతోనే రేవంత్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో రేవంత్ రెడ్డి సతమతమవుతున్నారని.. మునుగోడు ఉప ఎన్నిక(Munugodu By polls)ల్లో రూ.25 కోట్లు రేవంత్ రెడ్డికి ఇచ్చానని ఈటెలరాజేందర్ ఎక్కడ అనలేదన్నారు.
వీరసింహారెడ్డి (Veerasimha Reddy) ఆడియో ఫంక్షన్ కి ఒంగోలులో పర్మిషన్ వస్తే ఆ సినిమాకి తాను పెట్టుబడి పెట్టినట్లు అసత్య ప్రచారం చేశారని పేర్కొన్నారు. ఏ సినిమాకైనా తాను, తన వియ్యంకుడు పెట్టుబడి పెట్టానని నిరూపిస్తే రాజకియాల నుంచి తప్పుకుంటానని చెప్పారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM MODI) పై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి విరుచుకుపడ్డారు. ఇటీవల ఆయన పదేపదే మోడీని టార్గెట్ చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు
బెంగళూర్ భూ సెటిల్‌మెంట్‌లో వచ్చిన డబ్బుల విషయంలో వివేకా, ఎర్ర గంగిరెడ్డి మధ్య తేడా వచ్చిందని దస్తగిరి సీబీఐకి ఇచ్చిన తొలి స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నాడు.
ఏమీ చేసినా మలయాళ గడ్డపై కాషాయ పార్టీ అడుగుపెట్టలేకపోతున్నది. ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీకి తీవ్ర నిరాశజనక ఫలితాలు వస్తున్నాయి. ఈసారి ఎలాగైనా కొన్ని స్థానాలు సొంతం చేసుకోవాలనే పట్టుదలతో కమలం పార్టీ ఉంది.
కర్ణాటకలో (Karnataka Elections) ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార బీజేపీని గద్దె దించేందుకు ప్రతిపక్షాలు అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. బీజేపీని ఓడించేందుకు తమకు ఉన్న అన్ని మార్గాల్లో ప్రజల వద్దకు వెళ్తున్నాయి. కమీషన్ ప్రభుత్వంగా (Commission Govt) గుర్తింపు పొందిన బస్వరాజ్ బొమ్మై ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రతిపక్ష పార్టీలు వేర్వేరుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒ...