తెలంగాణ(Telangana)లో బీజేపీ(BJP) అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా(Amithshah) అన్నారు. చేవెళ్లలో బీజేపీ విజయ సంకల్ప సభ(BJP Vijaya sankalpa sabha)ను నిర్వహించారు. ఈ సభకు కేంద్ర మంత్రులు అమిత్ షా(Amithshah), కిషన్ రెడ్డి(Kishan reddy), రాష్ట్ర బీజేపీ నేతలు పాల్గొన్నారు. సభలో బండి సంజయ్(Bandi sanjay) మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణను అభివృద్ధి చేయడానికే అమిత్ షా రాష్ట్రానికి వచ్చినట్లు తెలిపారు.
ఒక్కసారి బీజేపీ(BJP)కి అవకాశం ఇస్తే తెలంగాణ(Telangana)ను అభివృద్ధి వైపు నడిపిస్తామన్నారు. తనను ఇటీవలె పోలీసులు అరెస్ట్ చేసి 8 గంటల పాటు రోడ్లపై తిప్పారన్నారు. తాను జైళ్లకు, పోలీసు కేసులకు భయపడనని అన్నారు. తెలంగాణ బీఆర్ఎస్(BRS) ప్రభుత్వాన్ని గద్దె దించుతామన్నారు.
అమిత్ షా(Amithshah) మాట్లాడుతూ..తెలంగాణ(Telangana)లో బీజేపీ(BJP) ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఎత్తివేస్తామన్నారు. రిజర్వేషన్లు అనేవి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రమే రాజ్యాంగ పరంగా వర్తిస్తాయని అమిత్ షా అన్నారు. రాష్ట్రంలో ఒవైసీ అజెండాను కేసీఆర్(Kcr) సర్కార్ అమలు చేస్తోందన్నారు. ఎంఐఎం(MIM) చెప్పినట్లు బీఆర్ఎస్(BRS) చేస్తోందన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ తో కలిసి నడవాలనుకుంటోందన్నారు. ఇటువంటి తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ ఆగడాలను సహించకూడదన్నారు. బీజేపీని అందరూ గెలిపించాలని అమిత్ షా కోరారు.