WFI అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై రెజ్లర్లు పోరాటానికి దిగిన సంగతి తెలిసిందే. బ్రిజ్ మాములు వ్యక్తి కాదు. అతనో శక్తి.. ఆరుసార్లు పార్లమెంట్‌కు ఎన్నికై.. నేరస్థులతో పరిచయం ఉన్న బడా నేత.
మహారాష్ట్ర(Maharashtra)లో సీఎం షిండే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందా..? త్వరలో ఆయన మాజీ కాబోతున్నారా..? ఎన్నికలకు ఏడాది ముందు మహారాష్ట్రలో మళ్లీ ప్రభుత్వం మారే అవకాశముందా..? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది.
రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేండ్లలోనే ఎట్లున్న తెలంగాణ ఎంత అభివృద్ధి చెందిందో మన కండ్ల ముందే ఉందని కేటీఆర్ చెప్పారు. జాతీయ స్థాయిలో తెలంగాణ సత్తా చాటుతోందని.. దానికి నిదర్శనమే జాతీయ అవార్డులు రావడమని పేర్కొన్నారు.
బీజేపీ ప్రభుత్వంలో లబ్ధి పొందిన కులాల లెక్కలు తీద్దాం. ప్రతి కులం మా పాలనతో లబ్ధి పొందింది. మరి అలాంటి సమయంలో ముస్లింల ఓట్లు మాకెందుకు? శివమొగ్గలో దాదాపు 60 వేల మంది ఉన్నారు. మాకు వారి ఓట్లు అవసరం లేదు
వైఎస్ వివేకా హత్య వెనుక పెద్ద కుట్ర ఉంది. ఈ విషయ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి తెలుసు. అయినా కూడా తమపై లేనిపోని అభాండాలు వేస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అసంతృప్తితో రగిలిపోతున్నాడు. అసంతృప్తి అనేది ఉంటే మనిషి ఎన్ని దారుణాలకైనా పాల్పడుతాడు.
వైఎస్ వివేకా హత్య కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కుట్రపూరితంగా ఈ పోస్టర్లు వేశారని తెలుస్తున్నది. అయితే ఈ పోస్టర్లు తాము వేయలేదని టీడీపీ నాయకులు చెబుతున్నారు. అధికార పార్టీ వైఎస్సార్ సీపీ నాయకులే పోస్టర్లు ముద్రించి పరువు తీసేందుకు ఈ కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
గతంలో ప్రధాన కార్యదర్శులు, ఇతర అధికారులుగా పని చేసిన వారిని కేసీఆర్ తన వెన్నంటే ఉంచేసుకున్నారు. బిహార్ రాష్ట్రానికి చెందిన సోమేశ్ ను అక్కడి ఎన్నికల్లో పోటీ చేసేలా కేసీఆర్ ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం. 2024 ఎన్నికల్లో మధుబని లోక్ సభ స్థానం నుంచి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు.
తాను తీసుకునే ఫుడ్ వంటకాల గురించి రాహుల్ గాంధీ ఇటీవల ఓ ఫుడ్ జర్నలిస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా రాహుల్(Rahul Gandhi) కీలక అంశాన్ని వెల్లడించారు. దేశంలోని రాజకీయ నాయకులలో 'ఉత్తమ చెఫ్' ఉన్నారని ప్రస్తావించారు. అతను ఎవరో కాదు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అత్యుత్తమ ఆహారాన్ని తయారు చేస్తారని వెల్లడించారు.