Why Minister Niranjan reddy Mobile Number changed asked bjp Raghunandan Rao
Raghunandan Rao:తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు (Raghunandan Rao), వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి (niranjan reddy) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మంత్రికి సంబంధించి రఘునందన్ (Raghunandan) ఇటీవల ఆరోపణలు చేయగా.. నిరంజన్ కౌంటర్ ఇచ్చారు. అందులో కొన్నింటినీపై స్పందించాలని రఘునందన్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. పలు కీలక అంశాలను ఆయన ప్రస్తావించారు.
నిరంజన్ రెడ్డి (niranjan reddy) మొబైల్ నంబర్ ఎందుకు మార్చారని రఘునందన్ రావు ప్రశ్నించారు. చైనాకు చెందిన మో (mo) అనే వ్యక్తితో నిరంజన్ మాట్లాడారని తెలిపారు. అతని ద్వారా అమెరికాలో (america) కొందరితో కాల్స్ (calls) చేశారని పేర్కొన్నారు. లావాదేవీలు బయటపడుతాయని భయపడి నంబర్ మార్చి ఉంటారని రఘునందన్ ఆరోపించారు. వీటిపై ఈడీ అధికారులకు (ED officials) లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
నిరంజన్ రెడ్డి దత్తపుత్రుడు గౌడ నాయక్ (gouda naik) గురించి ప్రస్తావించారు. గౌడ నాయక్ ఏ బ్యాంకు అకౌంట్ నుంచి లావాదేవీలు జరిపారని.. కొనుగోలు చేసిన భూములు నల్లధనంతో కొన్నారా అనే అంశంపై విచారణ జరిపించాలని ఐటీ శాఖ (IT) కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తానని రఘునందన్ రావు (Raghunandan) తెలిపారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత, పంచాయతీరాజ్ కాంట్రాక్టులను గౌడ నాయక్ చేస్తున్నారని ఆయన (Raghunandan) ఆరోపించారు.
గతంలో తాను లేవనెత్తిన సర్వే నంబర్లలో 60 గురించి మాత్రమే మంత్రి (Minister) మాట్లాడారని.. మరీ 53, 54, 59, ఇతర సర్వే నంబర్ల గురించి మాత్రం మాట్లాడలేదని రఘునందన్ చెప్పారు. వేరుసెనగ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు భూమి చదును కోసం రూ.40 లక్షల ప్రొసీడింగ్స్ ఇచ్చారని గుర్తుచేశారు. అగ్రికల్చర్ వర్సిటీ నుంచి పనులను దత్తపుత్రుడికి నిరంజన్ రెడ్డి (niranjan reddy) ఇచ్చారని ఆరోపించారు.
తన సవాల్‌పై స్పందించిన మంత్రి ఆహ్వానాన్ని స్వాగతిస్తున్నానని రఘునందన్ రావు (Raghunandan) తెలిపారు. ఎప్పుడు పిలిచినా వ్యవసాయ క్షేత్రానికి వెళ్తానని చెప్పారు. ఒకవేళ వ్యవసాయ క్షేత్రాన్ని రూ.4 కోట్లకు విక్రయిస్తే వైట్ మనీ ఇచ్చి కొనుగోలు చేస్తానని చెప్పారు. దత్తపుత్రుడి పేరుతో రుణం తీసుకోలేదని, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా జేసీబీ, ఇటాచీ తీసుకోలేదని, డ్రిప్ ఇరిగేషన్ రుణం తీసుకోవాలని చెప్పాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. కేవలం కొన్ని భూములపై మాత్రం స్పందించారని.. అన్నీ అంశాలపై స్పందించాలని కోరారు.