YS Sharmila and police are Arguments in the nampally court
YS Sharmila:సిట్ కార్యాలయం ముట్టడించి.. ‘టీ సేవ్’ నిరాహార దీక్షలో ప్రతిపక్ష నేతలను కలిసి మద్దతు కోరాలని షర్మిల (YS Sharmila) అనుకున్నారు. ఈ రోజు ఉదయం ఇంటి నుంచి బయలుదేరుతుండగా.. పోలీసులు మోహరించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు హై డ్రామా కొనసాగుతోంది.
ఇంటి వద్ద నుంచి పోలీసులతో షర్మిలకు (YS Sharmila) వాగ్వివాదం జరిగింది. సొంత పనుల మీద బయటకు వెళితే ఎలా అడ్డుకుంటారని అడిగారు. బంజారాహిల్స్ ఎస్సై రవీందర్, మహిళా కానిస్టేబుల్‌పై షర్మిల చేయి చేసుకున్నారు. జూబ్లీహిల్స్ పీఎస్‌కు తరలించారు. షర్మిల (YS Sharmila) చేయి చేసుకున్న పోలీసులు బంజారాహిల్స్ పీఎస్‌లో పనిచేస్తుండటంతో అక్కడ కేసు నమోదు చేశారు. విషయం తెలిసి వచ్చిన షర్మిల (YS Sharmila) తల్లి విజయమ్మ కూడా దురుసుగా ప్రవర్తించారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని షర్మిల ఏ1, డ్రైవర్ బాలు ఏ2, మరో డ్రైవర్ జాకబ్‌ను ఏ3గా చేర్చారు.
షర్మిలను (YS Sharmila) అరెస్ట్ చేసి.. గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు చేశారు. నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు 24 గంటలు పనిచేస్తారని.. అలాంటి వారిపై చేయి చేసుకోవడం సమాజానికి తప్పుడు సందేశం వెళ్తుందని పోలీసుల (police) తరఫు లాయర్ కోర్టులో వాదనలు వినిపించారు. షర్మిల కారు డ్రైవర్‌ను పోనివ్వాలని చెప్పారని.. ఓ పోలీస్ కానిస్టేబుల్ కాలికి గాయమందని తెలిపారు. మరో మహిళా కానిస్టేబుల్.. ఎస్సైపై షర్మిల (YS Sharmila) చేయి చేసుకున్నారని కోర్టుకు వివరించారు.
ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా షర్మిలను అడ్డుకున్నారని షర్మిల (YS Sharmila) తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పోలీసులు ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. ఓ ఎస్సై తనను చేతితో తాకే ప్రయత్నం చేశారని షర్మిల కోర్టుకు తెలిపారు. చాలా మంది పోలీసులు అడ్డుకొని.. చేయి విరిచే ప్రయత్నం చేశారని చెప్పారు. తనను కొట్టడంతో వారిని తోసి వేయాల్సి వచ్చిందని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.