YS Avinash:మాజీమంత్రి వైఎస్ వివేకానంద (vivekananda) హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (YS Avinash) బెయిల్ పిటిషన్ విచారణను తెలంగాణ హైకోర్టు (high court) రేపటికి వాయిదా వేసింది. హత్య కేసులో అవినాష్‌కు (Avinash) తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఈ నెల 25వ తేదీ వరకు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిని వివేకా కూతురు సునీత (sunitha) సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్‌ను నిన్న సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోనే ధర్మాసనం విచారించింది. బెయిల్ ఇవ్వడంపై తెలంగాణ హైకోర్టు తీరును తప్పుపట్టింది. బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. అయినప్పటికీ తెలంగాణ హైకోర్టులో (high court) తేల్చుకోవాలని సుప్రీంకోర్టు (supreme court) సూచించింది.
షెడ్యూల్ ప్రకారం ఈ రోజు అవినాష్ (Avinash) బెయిల్ పిటిషన్ విచారణకు రావాలి. మంగళవారం మధ్యాహ్నాం వరకు సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ హైకోర్టుకు చేరలేదు. సుప్రీంకోర్టు డాక్యుమెంట్స్ లేకుండా విచారణ కొనసాగించలేమని పేర్కొంది. సుప్రీం ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా విచారణ ఉంటుందని మేజిస్ట్రేట్ తెలిపారు. విచారణను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేశారు. వాదనలు జరిగే క్రమంలో.. పిటిషన్ రేపు విచారిస్తామని హైకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది.
11 పేజీలతో సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ (order copy) ఉంది. అవినాష్‌కు (Avinash) మధ్యంతర బెయిల్, తెలంగాణ హైకోర్టు వైఖరిపై సీజేఐ సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహాం వ్యక్తం చేసింది. దర్యాప్తు దశలో హైకోర్టు (high court) జోక్యం చేసుకోవడంపై మండిపడింది. సీబీఐ (cbi) దర్యాప్తును నీరుగార్చేలా హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేసింది. సీబీఐ అఫిడవిట్‌లోని అంశాలను తప్పుగా అన్వయించుకుని హైకోర్టు (high court) అసాధారణమైన ఉత్తర్వులు జారీచేసిందని సుప్రీంకోర్టు (supreme court) అభిప్రాయపడింది.
వివేకా హత్య కేసులో స్టేటస్ రిపోర్ట్‌ను సుప్రీంకోర్టు (supreme court) మరో 2 నెలలు పొడగించింది. ఈ నెల 30వ తేదీతో సీబీఐ స్టేటస్ రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంది. హత్య కేసులో అవినాష్ కీలకం అని.. అతని విచారణతో కేసు దర్యాప్తు పూర్తి అవుతోందని సీబీఐ అధికారులు చెబుతున్నారు. ఆ క్రమంలో స్టేటస్ రిపోర్ట్ ఇచ్చే గడువు పెంచేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.