Puvvada Ajay Kumar:ఖమ్మంలో కమ్మ రాజకీయాలు హీటెక్కాయి. మాజీ కేంద్రమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి (Renuka chaudhary), మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరింది. ఖమ్మంలో (kammam) నిన్న నిరుద్యోగ దీక్షలో కామెంట్లు చేసి రేణుకా చౌదరి అగ్గిరాజేశారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) లక్ష్యంగా విమర్శలు చేశారు.
జిల్లాలో ఓ దుష్ట శక్తి ఉందని రేణుకా చౌదరి (Renuka chaudhary) స్టార్ట్ చేశారు. మంత్రి అంట.. కొండలు దోచుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజల సొమ్ము కాజేస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మం (kammam) నగరానికి తాను వస్తే చాలే.. ఇక్కడ 144 సెక్షన్ విధిస్తారని చెప్పారు. తాను చేతికి వేసుకుంది గాజులు కాదు.. విష్ణు చక్రాలు అని స్పష్టంచేశారు.
రేణుకా చౌదరీ (Renuka chaudhary) కామెంట్లకు పువ్వాడ అజయ్ (Puvvada Ajay) స్పందించారు. ఖమ్మంలో తనపై పోటీ చేసి గెలువాలని కోరారు. రేణుకా చౌదరీ (Renuka chaudhary) విజయం సాధిస్తే.. రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. ప్రజలు ఎవరితో ఉన్నారో తెలుస్తోందని పువ్వాడ (puvvada) అన్నారు. రేణుకా చౌదరి (Renuka chaudhary) అంటే పబ్బులు, గబ్బులు అని విమర్శించారు. గిరిజనులకు టికెట్లు ఇస్తామని చెప్పి.. ప్రాణాలు తీసిన చరిత్ర అని పేర్కొన్నారు. గిరిజనులు, బలహీనుల వద్ద డబ్బులు నొక్కింది మీరు కాదా అన్నారు.
ఎంపీగా, కేంద్రమంత్రిగా ఉండి ఖమ్మం జిల్లాకు ఏం చేశారని పువ్వాడ అజయ్ (Puvvada Ajay) అడిగారు. పైగా గాజులు కాదు.. విష్ణు చక్రాలు అంటారని మండిపడ్డారు. జిల్లాలో ఫ్లై ఓవర్ బ్రిడ్జీ నిర్మాణానికి సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేస్తే పూర్తయ్యిందని ఆయన చెప్పారు. భాష తీరు మార్చుకోవాలని సూచించారు. వాడు, వీడు, అరేయ్, తొరెయ్ అనడం ఏంటీ అన్నారు. దీనిపై ప్రజల నుంచి వ్యతిరేకత రానుందని చెప్పారు. న్యాయపరంగా కూడా మూల్యం చెల్లించుకుంటారని.. లీగల్గా పోరాడుతానని తెలిపారు.