VZM: రాష్ట్ర మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఈనెల 21న బొబ్బిలి వైసీపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు చెప్పారు. బొబ్బిలిలో బుధవారం అయన మాట్లాడుతూ.. రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని యువతను కోరారు. రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.