అల్లుఅర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ‘AA 22’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న మూవీ షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే అట్లీ నిర్ణయం తీసుకున్నారని, స్క్రిప్ట్‌పరంగా కూడా మార్పులు చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. వచ్చే ఏడాది దసరాకు సినిమా విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.