VZM: జామి మండలం చింతాడ గ్రామానికి చెందిన డేగల ఎర్ని వెంకటరావు ఏపీ సివిల్ కానిస్టేబుల్‌గా ఎంపికై మంగళగిరిలో నియామక పత్రం అందుకున్నాడు. ఈయన తండ్రి అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారు. తల్లి కూలి పనులు చేసుకుంటూ ఎంతో కష్టపడి కుమారుడిని చదివించింది. ఇంటి పరిస్థితులను అర్ధం చేసుకున్న వెంకట్రావు అనుకున్న లక్ష్యాన్ని సాధించి ఉద్యోగాన్ని సంపాదించాడు.