»Election Of Speaker Of Telangana Assembly Was Unanimous
TS Assembly Speaker : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం
తెలంగాణ శాసనసభ స్పీకర్ పదవికి నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. వికారాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు.
TS Assembly Speaker : తెలంగాణ శాసనసభ స్పీకర్ పదవికి నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. వికారాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆయన శాసన సభ కార్యదర్శికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ప్రసాద్ కుమార్ వెంట సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో పాటు పలువురు మంత్రులు ఉన్నారు. గడ్డం ప్రసాద్ కుమార్ పేరును ప్రతిపాదిస్తూ మాజీ మంత్రి కేటీఆర్ నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు. గురువారం ఉదయం శాసనసభలో స్పీకర్ ఎన్నిక జరగనుంది.
తెలంగాణ శాసనసభ స్పీకర్ అభ్యర్థిగా మాజీ మంత్రి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. సాధారణంగా అధికార పార్టీ అభ్యర్థి స్పీకర్గా ఉంటారు. స్పీకర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ గా నియమితులైతే తెలంగాణ తొలి దళిత స్పీకర్ అవుతారు. తెలంగాణ శాసనసభలో అత్యధికులు అగ్రవర్ణాలకు చెందినవారే. కానీ దళిత నేతకు స్పీకర్ పదవి ఇచ్చి ప్రజల్లోకి అగ్రస్థానంలో ఉన్నామన్న భావనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.