Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. 15 రాష్టాలకు సంబంధించి రాజ్యసభ ఎన్నికల(Rajya Sabha Elections)కు కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా ప్రకటన చేసింది. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 8న విడుదల చేయనున్నట్టు పేర్కొంది. ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించనుంది. మొత్తం 56 మంది రాజ్యసభ సభ్యులకు ఈ ఎన్నిక జరగనుంది. ఏపీలో మూడు స్థానాలు, తెలంగాణలో మూడు స్థానాలు, కర్ణాటకలో 4 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీనిలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో 10 స్థానాలకు యూపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో 6 స్థానాలు, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో 5 స్థానాలలో ఎన్నకలు జరగనున్నాయి.