CM KCR:సీఎం కేసీఆర్ను (kcr) తిడితే పెద్దవాళ్లం అయిపోతామని అనుకుంటే పొరపాటని మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు. అలా అనుకున్న నేతలు ప్రజల్లో పలుచన అవుతారని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ ఎన్ని ట్రిక్కులు చేసినా ఆ పార్టీలను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదన్నారు. సిద్దిపేట శివారులో గల రంగనాయక సాగర్ వద్ద జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి ప్లినరీ, చిన్నకోడూరు మండలం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో హరీశ్ రావు (Harish Rao) పాల్గొన్నారు.
అభివృద్ధిలో అట్టడుగున ఉన్న తెలంగాణను దేశానికి ఆదర్శంగా కేసీఆర్ (kcr) నిలిపారని హరీశ్ రావు (Harish Rao) గుర్తుచేశారు. నిజం మాట్లాడాలని.. నిజం చెప్పాలని, లేదంటే అబద్దాలు రాజ్యం ఎలుతాయని అంబేద్కర్ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. సమాధులు తవ్వాలని, భవనాలు కూలగొడతామని అంటున్నారని.. కూలగొట్టే వాళ్లు కావాలో..? ప్రగతి పునాదులు వేసే వారు కావాలో ప్రజలు తేల్చుకోవాలని హరీశ్ రావు (Harish Rao) కోరారు.
దేశంలో వరి సాగు అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో అవుతోందని తెలిపారు. కేసీఆర్ (kcr) పథకం అందని ఇల్లు రాష్ట్రంలో లేదని గుర్తుచేశారు. గతంలో మూగజీవాలకు కూడా గ్రాసం లేని పరిస్థితి.. ఇప్పుడు పశుగ్రాస కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నామని వివరించారు. కేంద్రంలోని బీజేపీ నేతలు తెలంగాణ ప్రగతిని ఢిల్లీలో (delhi) ప్రశంసిస్తున్నారని తెలిపారు. ఇక్కడ మాత్రం తిడతారని పేర్కొన్నారు. ప్రధాని మోడీ (modi) తప్పులను ఎత్తి చూపితే ఈడీ (ed), ఐటీ (it), సీబీఐను (cbi) ఉసిగొల్పుతారని పేర్కొన్నారు.
ఇప్పుడు బీఆర్ఎస్ (brs) పార్టీ హవా కొనసాగుతోందని చెప్పారు. దేశంలో ఎక్కడికి వెళ్లినా అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని జేజేలు పలుకుతున్నారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రానికి పేరు, గౌరవం సీఎం కేసీఆర్ వల్ల పెరుగుతున్నాయని తెలిపారు.