Clyde Castro : మహారాష్ట్రకు నూతన సీఎం… షిండేకు బీజేపీ హుకుం..?
మహారాష్ట్ర(Maharashtra)లో సీఎం షిండే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందా..? త్వరలో ఆయన మాజీ కాబోతున్నారా..? ఎన్నికలకు ఏడాది ముందు మహారాష్ట్రలో మళ్లీ ప్రభుత్వం మారే అవకాశముందా..? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది.
మహారాష్ట్ర(Maharashtra)కు త్వరలోనే నూతన సీఎం బోతున్నారని ఎన్సీపీ అధికార ప్రతినిధి క్లైడ్ క్యాస్ట్రో (Clyde Castro) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారాయి. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని బీజేపీ ఏక్ నాథ్ షిండే(Ek Nath Shinde)కు హుకుం జారీ చేసిందని.. దీంతో ఆయన మనస్తాపంతో మూడు రోజుల పాటు సెలవులు పెట్టి వెళ్లారని క్యాస్ట్రో ఆరోపించారు. అయితే మీడియా వర్గాలు తనకు ఈ విషయంనూ కచ్చితమైన సమాచారం అందించాయని క్లైడ్ క్యాస్ట్రో తెలిపారు. త్వరలోనే దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఏక్ నాథ్ షిండే డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని క్లైడ్ క్యాస్ట్రో చెప్పుకొచ్చాడు. ఇది నిజమేనా.. షిండే, ఫడ్నవీస్ తమ పదవులు మార్పుకోబోతున్నారని మీడియా వర్గాలు తెలిపాయి..
ఈ విషయం గురించి ఢిల్లీలో మీటింగ్ కూడా జరిగిందట.. బీజేపీ పదవి మార్చుకోమని తనకు చెప్పడం ఇష్టం లేక షిండే మూడు రోజులు సెలవు పెట్టి వెళ్లారా అని క్లైడ్ క్యాస్ట్రో ట్విట్ చేశారు.రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి గతేడాది ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray)పై తిరుగుబావుటా ఎగురవేసి బీజేపీతో ఏక్ నాథ్ షిండే చేతులు కలిపారు. ఆ తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే షిండేను బీజేపీ (BJP) బెదిరించిందని.. తమతో చేతులు కలపకపోతే కేంద్ర దర్యాప్తు సంస్థలతో అరెస్ట్ చేయిస్తామని బ్లాక్ మెయిల్ చేసిందని ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే ఇటీవలే చెప్పారు. హైదరాబాద్(Hyderabad) లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. బీజేపీతో కలిసి వెళ్లడానికి ముందు షిండే తమ ఇంటికి వచ్చి ఏడ్చారని ఆదిత్య ఠాక్రే పేర్కొన్నారు. అజిత్(Ajith) వర్గం బీజేపీలో చేరినా, చేరకపోయినా.. ఎన్నికలకు ముందుగా మహారాష్ట్ర ప్రభుత్వంలో మార్పులు చేయాలనేది బీజేపీ ఆలోచనగా తెలుస్తోంది. సీఎం సీటు ఫడ్నవీస్ కి ఇచ్చి, డిప్యూటీగా ఏక్ నాథ్ షిండేని చేయాలని బీజేపీ అధిష్టానం ఆల్రడీ నిర్ణయం తీసుకుందట.