ys sharmila:వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిలకు (ys sharmila) నాంపల్లి కోర్టు బెయిల్ (bail) మంజూరు చేసింది. పోలీసులతో (police) అనుచితంగా ప్రవర్తించారని నిన్న 14 రోజుల రిమాండ్ (14 days remand) విధించిన సంగతి తెలిసిందే. ఈ రోజు బెయిల్ (bail) పిటిషన్పై షర్మిల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆమెకు షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ.. మేజిస్ట్రెట్ తీర్పు ఇచ్చారు
అంతకుముందు జైలులో ఉన్న కూతురు షర్మిలను (sharmila) విజయమ్మ (vijayamma0 పరామర్శించారు. ప్రజల కోసం పోరాడే వ్యక్తిని, ప్రజల కోసం ప్రశ్నించే వ్యక్తిని ప్రభుత్వం అణచివేస్తోందని మండిపడ్డారు. పోలీసుల అత్యుత్సాహాం, ప్రభుత్వ అలసత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారని గుర్తుచేశారు. ప్రజల కోసం 3800 కిలో మీటర్ల పాదయాత్రను షర్మిల (sharmila) చేసిందని గుర్తుచేశారు. అరెస్టులకు భయపడే వ్యక్తి షర్మిల కాదన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని తెలియజేశారు. టీఎస్ పీఎస్సీ పేపర్స్, పదో తరగతి పరీక్ష పేపర్లు లీక్ అవుతుంటే అడగటం తప్పా.? అని నిలదీశారు. సిట్ (sit) వద్దకు ఒంటరిగా వెళ్లి ప్రశ్నిస్తే ఎందుకు అడ్డుకుంటారని ప్రశ్నించారు.
షర్మిలను (sharmila) ఎందుకు అరెస్ట్ చేశారు.. ఆమె క్రిమినలా.. లేదంటే ఉగ్రవాదా..? అని విజయమ్మ (vijayamma) నిలదీశారు. నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుందని.. వారి సమస్యలపై షర్మిల (sharmila) పోరాటం చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల సమావేశాలకు అనుమతి ఇచ్చి.. షర్మిలను (sharmila) మాత్రం ఎందుకు ఇంట్లోంచి బయటకు రానివ్వడం లేదని అడిగారు. ప్రశ్నించే గొంతుల్ని అరెస్టులు చేయడం న్యాయమా అని మండిపడ్డారు. ఇదేనా కేసీఆర్ ప్రభుత్వ విధానం? అని దుయ్యబట్టారు.
సమస్య చూపిస్తే..సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వంపై ఉంటుందన్నారు. అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ఎంత కాలం అరెస్ట్ చేస్తారు.. జైలులో పెడతారని మండిపడ్డారు. అణచి వేస్తే ప్రజలే ప్రశ్నించే రోజు తెచ్చుకోవద్దని హితవు పలికారు. ప్రతిపక్షాలపై తీరు మార్చుకోకుంటే ప్రజలు, నిరుద్యోగులు సరైన సమాధానం చెబుతారని పేర్కొన్నారు. బెయిల్ మీద విడుదలయిన తన కూతురు షర్మిల ప్రజలు, నిరుద్యోగుల కోసం పోరాడుతుందని తెలిపారు.