Eknath Shinde supports to Uddhav Camp Leader Balasaheb Chandore
Uddhav vs shinde:బాలాసాహెబ్ చాండొర్కు అండగా ఉంటానని మహారాష్ట్ర సీఎం, శివసేన పార్టీ అధినేత ఏక్ నాథ్ షిండే (Eknath Shinde) అన్నారు. బాలాసాహెబ్.. ఉద్దవ్ థాకరేకు చెందిన ఉద్దవ్ బాలాసాహెబ్ థాకరే శివసేన (shivasena) పుణే అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని చర్యలు తీసుకున్నారు. పార్టీ నుంచి బహిష్కరణ వేటు వేశారు. తర్వాత బాలాసాహెబ్ షిండే శివసేనలో చేరగా.. ఆయన అండగా నిలిచారు.
బాలాసాహెబ్ చాండొర్కు శివసేన స్వాగతం పలుకుతోంది.. మీకు నేనున్నా.. శివసేన (shivasena) ఉంది అని షిండే అన్నారు. శివసేన పార్టీ కోసం పనిచేశారు. థాకరే ఐడియాలజీని ముందుకు తీసుకెళ్లారు అని పేర్కొన్నారు.
ఉద్దవ్ థాకరే (Uddhav) వర్సెస్ ఏక్నాథ్ షిండే మధ్య వార్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ఉద్దవ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో షిండే తిరుగుబాటు చేశారు. 40 మంది ఎమ్మెల్యేలతో క్యాంప్ వేశారు. బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి.. సీఎం పదవీ చేపట్టారు. పార్టీ గుర్తుకు సంబంధించి ఎన్నికల సంఘం కూడా షిండేకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.