»Good News For Mumbai Metro Commuters 25 Percent Discount
Maharashtra : ముంబై మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ … 25 శాతం రాయితీ
మెట్రో రైలు ప్రయాణికులకు మహారాష్ట్ర (Maharashtra) సర్కారు శుభవార్త చెప్పింది. ముంబై మెట్రో రైళ్లలో ప్రయాణించేవారికి 25 శాతం రాయితీ ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శనివారం ప్రకటించారు. మే 1 నుంచి 65 ఏళ్లు పైబడిన పౌరులు, దివ్యాంగులు, 12వ తరగతి వరకు విద్యార్థులు మే 1 నుంచి రాయితీపై మెట్రో లైన్ 2A, 7లో ప్రయాణించవచ్చని తెలిపారు.
ముంబై వాసులకు మహారాష్ట్ర (Maharashtra) ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పంది. మే 1వ తేదీ నుంచి ముంబై మెట్రో రైళ్లలో 25 శాతం టిక్కెట్ రాయితీతో ప్రయాణించవచ్చని ప్రకటించింది. 65 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు(disabled people), 12వ తరగతి వరకూ విద్యార్థులు మెట్రో లైన్ (Metro line) 2A, 7లో ఈ సౌకర్యం వినియోగించుకోవచ్చని తెలిపింది. మే 1వ తేదీన మహారాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ కానుకను ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (Eknath Shinde) శనివారంనాడు ప్రకటించారు. నేషనల్ మొబిలిటీ కార్డు (ముంబై వన్) ఉన్న వేలాది మందికి కూడా ఈ వెసులుబాటును కల్పిస్తున్నట్టు సీఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రభుత్వం ప్రకటించిన రాయితీని ఉపయోగించుకోవాలంటే దివ్యాంగులు(disabled) తగిన డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. మెడికల్ లేదా ప్రభుత్వ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది. సీనియర్ సిటిజన్లు (Senior citizens) వయో నిర్ధారణ ఆధారాలు చూపించాలి. విద్యార్థులు తమ పాన్ కార్డు కానీ, తల్లిదండ్రుల పాన్ కార్డులు (PAN cards) కానీ స్కూలు ఐడీతో సహా చూపించాలి. లైన్ 2A, 7 రూట్లలో వీటిని చూపించాల్సి ఉంటుంది. కాగా, రాష్ట్ర రవాణా బస్సుల్లో సీనియర్ సిటిజన్లకు ప్రీ ప్రయాణం, మహిళలకు టిక్కెట్లలో 50 శాతం రాయితీతో ప్రయాణించే సౌకర్యం తమ ప్రభుత్వం కల్పిస్తోందని షిండే తెలిపారు.