»Kerala Modi Tour High Alert After Threat Letter Received Against Pm Modis Visit
మా రాష్ట్రంలోకి Modi వస్తే చంపేస్తాం.. Keralaలో బెదిరింపు లేఖ కలకలం
ఏమీ చేసినా మలయాళ గడ్డపై కాషాయ పార్టీ అడుగుపెట్టలేకపోతున్నది. ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీకి తీవ్ర నిరాశజనక ఫలితాలు వస్తున్నాయి. ఈసారి ఎలాగైనా కొన్ని స్థానాలు సొంతం చేసుకోవాలనే పట్టుదలతో కమలం పార్టీ ఉంది.
ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీపై (Narendra Modi) ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాది ప్రాంతంలో (South India) మోదీకి వ్యతిరేకంగా ఆందోళనలు సాగుతున్నాయి. తెలంగాణలో (Telangana) పర్యటించిన ప్రతిసారీ మోదీ పర్యటన వివాదాస్పదమవుతుండగా.. తమిళనాడులో ఇదే పరిస్థితి ఉంది. తాజాగా కేరళలో అలాంటి పరిణామాలే ఎదురవుతున్నాయి. తమ రాష్ట్రంలోకి అడుగుపెడితే మోదీని చంపేస్తామంటూ బెదిరింపులు మొదలయ్యాయి. ఏప్రిల్ 24న మోదీ పర్యటిస్తున్న నేపథ్యంలో ఈ బెదిరింపు లేఖ (Threat Letter) వెలుగులోకి రావడంతో కేరళలో (Kerala) కలకలం రేపుతున్నది. దీంతో కేరళలో హై అలర్ట్ ప్రకటించారు.
ఎర్నాకులం (Ernakulam) నగరానికి చెందిన జానీ నడుముత్తమిల్ అనే పేరుపై ఓ వ్యక్తి బీజేపీ కార్యాలయానికి బెదిరింపు లేఖ వచ్చింది. ఈ నెల 17వ తేదీన లేఖ వచ్చినట్లు గుర్తించారు. మలయాళం భాషలో రాసిన ఆ లేఖ కలకలం రేపింది. ఆ లేఖలో మోదీ మా రాష్ట్రానికి వస్తే ఆత్మహుతి దాడులకు పాల్పడతామని బెదిరింపులు ఉన్నాయి. వెంటనే బీజేపీ కేరళ నాయకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ లేఖపై వివరాలు ఆరా తీశారు. లేఖలో ఉన్న పేరుగల వ్యక్తిని విచారించగా.. తాను అలాంటి లేఖ రాయలేదని స్పష్టం చేశారు. తన పేరుతో ఎవరో పంపించి ఉంటారని పేర్కొన్నాడు.
ఏదీ ఏమైనా పర్యటన ముందు బెదిరింపు లేఖ రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ప్రధాని రెండు రోజుల పర్యటనకు పటిష్ట బందోబస్తు (High Security) ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏప్రిల్ 24, 25 తేదీల్లో మోదీ కేరళలో పర్యటిస్తున్నారు. వందే భారత్ రైల్ తో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దీంతోపాటు బీజేపీ యువజన సంఘాలు నిర్వహించే ‘యువం’ కార్యక్రమంలో కూడా ప్రధాని పాల్గొననున్నారు. పార్టీ ఆ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ (Surendran) ఆధ్వర్యంలో ప్రధాని పర్యటనకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
కాగా కేరళలో అడుగుపెట్టేందుకు బీజేపీ అష్టకష్టాలు పడుతోంది. కేరళలో ఒక్క సీటు (MLA) గెలిచేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఏమీ చేసినా మలయాళ గడ్డపై కాషాయ పార్టీ అడుగుపెట్టలేకపోతున్నది. ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీకి తీవ్ర నిరాశజనక ఫలితాలు వస్తున్నాయి. ఈసారి ఎలాగైనా కొన్ని స్థానాలు సొంతం చేసుకోవాలనే పట్టుదలతో కమలం పార్టీ ఉంది. ఈ క్రమంలోనే అమిత్ షా, మోదీ తరచూ కేరళ పర్యటనలు ఉండేలా చూసుకుంటున్నారు.