సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) కాంగ్రెస్ పార్టీపైనా, టీపీసీసీ చీఫ్ పైనా బురద జల్లడాన్ని ఆయన ఖండించారు. ఈ సందర్భంగా భట్టి ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ప్రజలలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఉండకూడదని బీజేపీ, బీఆర్ఎస్(BJP,BRS) పార్టీలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.
Bhatti Vikramarka : టీపీసీసీ రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై, మాజీ మంత్రి ఈటల రాజేందర్(Etala Rajendar) చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో పెను సంచలనమే రేపుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో పాతిక కోట్లు తీసుకోలేదంటూ ఇప్పటికే ఛార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలో రేవంత్ ప్రమాణం చేశారు. ఈ వ్యవహారంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ విషయంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) కాంగ్రెస్ పార్టీపైనా, టీపీసీసీ చీఫ్ పైనా బురద జల్లడాన్ని ఆయన ఖండించారు. ఈ సందర్భంగా భట్టి ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ప్రజలలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఉండకూడదని బీజేపీ, బీఆర్ఎస్(BJP,BRS) పార్టీలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. రెండు పార్టీల ఎంజెడాలో భాగంగానే అయిపోయిన మునుగోడు ఎన్నికలపై ఈటల మాట్లాడన్నారు.
ఎనిమిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన దోపిడీలో అతిపెద్ద వాటాదారు ఈటల రాజేందరే అన్నారు. నిన్నటి దాకా ఉన్న భూస్వాముల పార్టీ మాది కాదంటూ ఈటలకు చురకలంటించారు. కాంగ్రెస్‌పై పడి ఏడవటం దేనికని భట్టి దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వ విధ్వంసం లోనూ ఈటలకు భాగముందన్నారు. కాంగ్రెస్ ప్రజల పార్టీ, ప్రజల ఇచ్చే విరాళలతో ఎన్నికలు జరుపుంటూ వచ్చామన్నారు భట్టి. నీతి నిజాయితీగా ఉండే పార్టీగా తప్పుడు పనులు ఎప్పుడు చేయాలేదు.. మీకు ఉన్న అలవాట్లే..కాంగ్రెస్ పార్టీకి కూడా ఉన్నయానే భావనతో మాట్లడటం సరైంది కాదన్నారు. ఇకపోతే.. ఆదివారం బీజేపీ కార్యాలయంలో ఈటల రాజేందర్ మీడియా(Media)తో మాట్లాడారు. తాను ఏ రాజకీయ నేత గురించి మాట్లాడలేదని .. తాను రేవంత్ రెడ్డి పేరే ప్రస్తావించలేదన్నారు. కానీ భాగ్యలక్ష్మి ఆలయం(bhagyalaxmi temple) వద్ద రేవంత్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకుంటూ తన గురించి అసభ్యకరంగా మాట్లాడారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకు పోయి వచ్చాడన్నారు. ప్రజల కోసం పోరాడి రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లలేదన్నారు.