ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) పర్యటన సందర్భంగా యర్రగొండపాలెంలో వైసీపీ(YCP) నేతలు అడ్డుకున్నారు. చంద్రబాబు రోడ్ షో(Road Show) నిర్వహిస్తున్న నేపథ్యంలో నల్ల బెలూన్లు, ఫ్లకార్డులతో వైసీపీ నేతలు నిరసన తెలిపారు. రోడ్డు షోను అడ్డుకునే ప్రయత్నం చేశారు. మంత్రి ఆదిమూలపు సురేష్ ఆఫీసు వద్ద చంద్రబాబు వాహనంపై రాళ్ల దాడి జరిగిట్లు సమాచారం.
మరోవైపు టీడీపీ(TDP) నేతలు కూడా ఆదిమూలపు సురేష్ ఆఫీసుపై రాళ్ల దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురు వైసీపీ(YCP) కార్యకర్తలకు గాయాలు కావడంతో వారికి మంత్రి క్యాంపు కార్యాలయంలోనే చికిత్స చేశారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో సంఘటనా స్థలంలో భారీగా పోలీసులు మోహరించారు. టీడీపీ, వైసీపీ నేతల మధ్య రాళ్ల దాడిని ఆపారు.
చంద్రబాబు(Chandrababu Naidu) కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో వైసీపీ(YCP) నేతలకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఎన్ఎస్జీ సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అడ్డుపెట్టి చంద్రబాబుపై రాళ్లు పడకుండా నిలువరించినట్లు సమాచారం. యర్రగొండపాలెంలో చంద్రబాబు సభ జరగాల్సి ఉండగా ఆ సమయంలోనే విద్యుత్ సరఫరా ఆగినట్లు తెలుస్తోంది. పోలీసులు ఇరు వర్గాల మధ్య దాడులు జరగకుండా చర్యలు తీసుకున్నారు.