»Ap Minister Who Threw A Challenge With His Shirt Open On The Road
Yarragondamvari Palem : నడిరోడ్డుపై చొక్కా విప్పి సవాల్ విసిరిన ఏపీ మంత్రి
ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య పొలిటికల్ వార్ రచ్చకెక్కుతుంది. టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు రోడ్ షోను అడ్డుకొనేందుకు మంత్రి ఆదిమూలపు సురేష్ చొక్కా విప్పి నిరసన తెలిపారు.
ప్రకాశం జిల్లా యర్రగొండంవారి పాలెం(Yarragondamvari Palem)లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు రోడ్ షోను అడ్డుకొనేందుకు మంత్రి ఆదిమూలపు సురేష్ చొక్కా విప్పి నిరసన తెలిపారు. చంద్రబాబు (Chandrababu) గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వైసీపీ (YCP) శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్ మీదకు వచ్చారు. నల్ల బెలూన్లు, టీ షర్టులు ధరించి.. బాబు గో బ్యాక్ ప్లకార్డులతో నిరసన చేపట్టారు. చంద్రబాబు దళితుల్ని అవమానపర్చారని క్షమాపణలు చెప్పాలని మంత్రి సురేష్ (Minister Suresh) డిమాండ్ చేశారు.చంద్రబాబు పర్యటనను ఉద్దేశపూర్వకంగా మంత్రి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిసి కూడా పోలీసులు కంట్రోల్ చేయలేదని టీడీపీ నేతలు విమర్శలుచేస్తున్నారు.
చంద్రబాబుపై మంత్రి ఆదిమూలపు సురేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు దళిత (Dalit) ద్రోహి అని ఫైర్ అయ్యారు. దళితులను అవమానించిన బాబూ కొడుకులకు దళిత నియోజకవర్గం యర్రగొండపాలెంలో తిరిగే అర్హతే లేదన్నారు. టీడీపీ కార్యకర్తలు మంత్రి ఆదిమూలపు ఆఫీసు వైపు దూసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు (Police) భారీగా మోహరించారు. ఇరువర్గాల పోటాపోటీ నిరసనల నేపథ్యంలో యర్రగొండపాలెంలో ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడ్డాయి. దళితులుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అంటూ అవహేళన చేసిన చంద్రబాబుకు ఇప్పుడు దళితుల ఓట్లు కావాల్సి వచ్చాయని.. అందుకోసమే దళితులపై ప్రేమ ప్రదర్శిస్తున్నారని మంత్రి సురేష్ ఆరోపించారు.